వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..

ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదన్న మాటలో ఎటువంటి సందేహం లేదు.

తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ఎంతటి కష్టానైనా భరిస్తూ వారి ఆలానా.

పాలనా.చూసుకోవడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంటారు.

అచ్చం అలాగే తన కూతురి కోసం ఒక డెలివరీ బాయ్ కష్టపడడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.తండ్రి ప్రేమకు ఇతడే అసలైన నిదర్శనం అంటూ ఒక జొమాటో డెలివరీ ఏజెంట్( Zomato Delivery Agent ) గురించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

తన కూతురి కోసం అతడు పడుతున్న కష్టం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Advertisement

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఢిల్లీలోని ఖాన్ మార్కెట్( Khan Market in Delhi ) వద్ద ఉన్న స్టార్ బాక్స్ వద్ద ఒక ఉదాంతం అయినా సంఘటన వెలుగులోకి వచ్చింది.ఒక ఆర్డర్ ను పికప్ చేసుకోనేందుకు తన రెండు సంవత్సరాల కూతురితో ఒక డెలివరీ ఏజెంట్ అక్కడికి వచ్చాడు.

డెలివరీ ఏజెంట్ ను చూడగానే ఒక్కసారిగా స్టోర్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు.ఈ క్రమంలో స్టోర్ మేనేజర్ ‘‘ఈ రోజు ఓ డెలివరీ ఏజెంట్ మా స్టోర్‌‌కు వచ్చాడు.

వ్యక్తిగత జీవితంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్న అతడు కూతురి కోసం కష్టపడుతున్న తీరు మమ్మల్ని కదిలించింది.చిన్నారిని వెంట తీసుకునే అతడు పనిలోకి వచ్చాడు.

కూతురి పట్ల అతడికున్న ప్రేమ, పని పట్ల నిబద్ధత గొప్పది’’ ఇలా తన భావనను వ్యక్తం చేశారు.అలాగే డెలివరీ ఏజెంట్ తన కూతురి పట్ల జాగ్రత్తగా వహిస్తూ తన పని తాను చేసుకోవడంలో ముందు ఉండడంతో అక్కడ ఉన్న వారి అందరూ వారి హృదయాలకు హత్తుకునేలా చేసింది.

ఎంతమంది చేరినా తెలంగాణ లో టీడీపీకి కష్టమేనా   ?  
చనిపోయిన భార్యను బ్రతికించిన ఒడిశా వ్యక్తి.. ఎలాగంటే?

ఇక ఈ సంఘటన పే జొమాటో కూడా స్పందిస్తూ పేర్కొంది.

Advertisement

అంతేకాకుండా., చిన్నారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పానీయాన్ని కూడా ఇచ్చాడు.‘‘చిన్నారికి బేబేచీనో ఇవ్వడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.

చిన్నారి మోముపై నవ్వు చూసి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.సోనూ కష్టం చూస్తుంటే మానవాళి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలరన్న నమ్మకం కలుగుతోంది.

సోనూ కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని, సిరిసంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము’’ అని స్టోర్ మేనేజర్ తెలియచేసారు.ఇక మరోవైపు నెటిజెన్లు కూడా సోను పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అతడి ఆర్థిక కష్టాలు కాస్త అయినా తీరాలాగా ఆన్లైన్లో నిధులు సేకరణ చేపట్టాలని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజా వార్తలు