బలహీనమైన జుట్టు కుదుళ్ళను బలంగా మార్చే ఎఫెక్టివ్ హెయిర్ మాస్క్ ఇది!

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, రెగ్యులర్‌గా షాంపూ చేసుకోవడం, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం, హెయిర్ స్ట్రెయిట్నర్ ను తరచూ ఉపయోగించడం తదితర కారణాల వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారతాయి.

దాంతో జుట్టు రాలే సమస్య తీవ్ర తరంగా మారుతుంది.

ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే బలహీనమైన జుట్టు కుదుళ్ళను బలంగా మార్చుకోవాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హెయిర్ మాస్క్ అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ మాస్క్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు వైట్ రైస్ ను వేసి వాటర్ తో రెండు సార్లు కడగాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న రైస్ ను వాటర్ తో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో రైస్ మిల్క్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ రైస్ మిల్క్ లో అరకప్పు కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే జుట్టు కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.

దాంతో హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అవుతుంది.కాబట్టి బలహీనమైన జుట్టు కుదుళ్ళతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఎఫెక్టివ్‌ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి.మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు