Yellow Teeth Coffee Powder: కాఫీ పొడితో ముత్యాల్లాంటి దంతాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు..ఎలాగంటే?

సాధారణంగా కొందరి దంతాలు తల తల మెరిసిపోతూ ఎంతో అందంగా మ‌రియు ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంటాయి.

కానీ కొందరి దంతాలు మాత్రం పసుపు రంగులో గార పట్టేసి అంద‌విహీనంగా ఉంటాయి.

ధూమపానం, దంత సంరక్షణ లేకపోవడం, మద్యపానం, కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం తదితర కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి.ఇలాంటి వారు ఇతరులతో మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు.

నలుగురిలో ఓపెన్ గా నవ్వెందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇక‌పై ప‌సుపు దంతాల‌తో అస్స‌లు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే కనుక ముత్యాల లాంటి తెల్ల‌టి మెరిసే దంతాలను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను వేసుకోవాలి.

Advertisement
This Home Remedy Helps To Get Rid Of Yellow Teeth Naturally Details! Home Remedy

ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ టూత్ పేస్ట్ ను వేసి బాగా మిక్స్ చేయాలి.

This Home Remedy Helps To Get Rid Of Yellow Teeth Naturally Details Home Remedy

ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్‌ సహాయంతో దంతాలకు అప్లై చేసి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో దంతాలు మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ విధంగా రోజుకు ఒకసారి కనుక చేస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలకు స్వస్తి చెప్పవచ్చు.ఈ రెమెడీని పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా మ‌రియు ఆక‌ర్ష‌ణీయంగా మారతాయి.

ప‌సుపు దంతాల‌తో బాధ‌ప‌డే వారు త‌ప్ప‌కుండా ఈ రెమెడీని పాటించేందుకు ట్రై చేయండి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు