ఈ ఎఫెక్టివ్ ప్యాక్ మీ తెల్ల జుట్టును స‌హ‌జంగానే న‌ల్ల‌గా మారుస్తుంది!

తెల్ల జుట్టు.వృద్ధాప్యానికి సంకేతం.

ఒక వ‌య‌సొచ్చాక దాదాపు అంద‌రినీ వైట్ హెయిర్ స‌మ‌స్య వేధిస్తూనే ఉంటుంది.

అయితే కొంద‌రు వైట్ హెయిర్ వ‌చ్చినా.

పెద్ద‌గా ప‌ట్టించుకోరు.కానీ, కొంద‌రు మాత్రం వైట్ హెయిర్‌తో బ‌య‌ట‌కు వెళ్తే.

ఇరుగు పొరుగు వారు ఎక్క‌డ ఎగ‌తాళి చేస్తారేమో అని క‌ల‌ర్స్‌తో క‌వ‌ర్ చేస్తుంటారు.అయితే ఆర్టిఫిషియల్ హెయిర్ క‌ల‌ర్స్ ను వాడ‌టం వ‌ల్ల జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

Advertisement

అలా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే మీ తెల్ల జుట్టు స‌హ‌జంగానే న‌ల్ల‌గా మారుతుంది.మ‌రి ఇంకెందుకు లేటు ఆ హెయిర్ ప్యాక్ ను ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేయండి.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ క‌లోంజి గింజ‌ల పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ మున‌గాకు పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి వేసి స్పూన్ తో తిప్పుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న పొడి చ‌ల్లారేలోపు స్ట‌వ్ పై మ‌రో గిన్నెను పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్ వేసి బాగా మ‌రిగించి. డికాక్ష‌న్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ డికాక్ష‌న్‌ను ముందుగా వేయించి పెట్టుకుని పొడిలో వేసి క‌ల‌పాలి.చివ‌రిగా ఈ మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.

Advertisement

క‌నీసం రెండు గంట‌ల పాటు ఈ ప్యాక్‌ను ఉంచుకోవాలి.అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను ట్రై చేస్తే తెల్ల జుట్టు స‌హ‌జంగానే న‌ల్ల‌గా, ఒత్తుగా మారుతుంది.

తాజా వార్తలు