మెడ న‌లుపును త‌గ్గించే కాఫీ క్రీమ్‌.. ఎలా త‌యారు చేసుకోవాలంటే?

సాధార‌ణంగా కొంద‌రి ముఖం ఎంతో తెల్ల‌గా, అందంగా ఉంటుంది.కానీ, మెడ మాత్రం న‌ల్ల‌గా, అందవిహీనంగా క‌నిపిస్తుంటుంది.

శ‌రీరంలో అధిక వేడి, ప్రెగ్నెన్సీ, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల మెడ డార్క్‌గా మారిపోతుంటుంది.దాంతో మెడ న‌లుపును వ‌దిలించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్యాకుల‌ను ప్ర‌య‌త్నిస్తుంటారు.

మెడ‌పై చేయాల్సిన ప్ర‌యోగాల‌న్నీ చేస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో తెలీక తెగ బాధ ప‌డిపోతూ ఉంటారు.

అయితే మెడ న‌లుపును త‌గ్గించ‌డానికి కాఫీ క్రీమ్‌ సూప‌ర్ ఎఫెక్టివ్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ కాఫీ క్రీమ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌, వ‌న్ విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్‌ను వేసి బీట‌ర్ సాయంతో నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటు బీట్ చేసుకుంటే కాఫీ క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.ఈ క్రీమ్‌ను ఒక బాక్స్‌లో నింపుకుంటే ప‌ది రోజుల పాటు వాడుకోవ‌చ్చు.స్నానం చేయ‌డానికి గంట లేదా రెండు గంట‌ల ముందు ఈ క్రీమ్‌ను మెడ‌కు అప్లై చేసి స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్నానం చేయాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక న‌లుపు క్ర‌మంగా త‌గ్గిపోయి మెడ అందంగా మ‌రియు మృదువుగా త‌యారు అవుతుంది.ఇక ఈ క్రీమ్‌ను ముఖానికి కూడా అప్లై చేసుకోవాలి.

పింపుల్స్‌, డార్క్ స్పాట్స్‌, డ్రై స్కిన్ వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో ఈ కాఫీ క్రీమ్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు