ఈ పిల్లి స్టైలే వేర‌బ్బా.. మెట్లు దిగ‌డం ఇష్టం లేక ఏం చేసిందంటే..

చిన్న పిల్ల‌లు ఇంట్లో చేసే అల్ల‌రి మామూలుగా ఉండ‌దు.ఒక ప‌నిని తిన్న‌గా చేయ‌కుండా.

ఏదో ఏదో చేస్తూ అంద‌రినీ టెన్ష‌న్ పెట్టేస్తారు.ఎన్ని సార్లు చెప్పినా స‌రే విన‌కుండా అలాగే చేయ‌డం వారికి అల‌వాటు అయిపోతుంది.

అయితే మెట్లు దిగ‌డంలో కూడా ఇలాగే చేస్తుంటారు చిన్న పిల్ల‌లు.మెట్లు దిగ‌డం అంటే వారికి ఇష్ట‌ముండ‌దేమో ఏమో గానీ.

ప‌క్క‌నే ఉన్న స‌పోర్టు మీద నుంచి జారుతుంటారు.అయితే ఈ న‌డుమ ఇండ్ల‌లో పెంచుకుంటున్న పెంపుడు జంతువులు కూడా ఇలాగే అల్ల‌రి చేయ‌డం మ‌నం చూస్తున్నాం.

Advertisement

అవి కూడా మ‌నుషుల‌ను బాగానే ఫాలో అయిపోతున్నాయి.అందుకే మ‌నుషులు ఎలా చేస్తే అవి కూడా అలాగే చేయ‌డం అల‌వాటు చేసుకుంటున్నాయి.

ఇంట్లో ఈ పెంపుడు జంతువులతో ఎక్కువ‌గా ఆడుకునేది చిన్న పిల్ల‌లే కాబ‌ట్టి ఎక్కువ‌గా ఆ పిల్ల‌లు చేసిన‌ట్టు చేస్తుంటాయి.వారి లాగే ఆట‌లాడ‌టం కావ‌చ్చు లేదంటే.

అల్ల‌రి చేయ‌డం కావ‌చ్చు.ఇలా ఎన్నో ప‌నులు చేస్తున్నాయి.

ఈ విష‌యంలో మొన్న‌టి దాకా పెంపుడు కుక్క‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తే.ఇప్పుడు ఆ ప్లేస్‌ను పిల్లులు తీసుకుంటున్నాయి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

ఇప్పుడు ఓ పిల్లి కూడా ఇలాగే చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

అదేంటో తెలుసుకుందాం.ఇందులో ఓ పిల్లి మెట్లు దిగ‌డం ఇష్టం లేన‌ట్టు.

రేయిలింగ్ మీదకు ఎక్కుతుంది.ఇంకే ముంది దాని మీద నుంచి ఎంచ‌క్కా జార‌డం స్టార్ట్ చేస్తుంది.

ఇలా చివ‌రి దాకా దాని మీద నుంచే జాగ్ర‌త్త‌గా జార‌డం మ‌నం చూడొచ్చు.నేనింతే నా దారి ర‌హ‌దారి అన్న‌ట్టు జార‌డం కూడా ఇందులో మ‌నం చూడొచ్చు.

ఈ వీడియో నెట్టింట్లో తెగ పాపుల‌ర్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా కూడా ఈ పిల్లి స్టైల్ మామ‌లుగా లేదు క‌దా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు