200 పాములను పట్టిన లేడిని భయపెట్టిన ఈ రెండు పాములు.. వీడియో వైరల్..

భూమి మీద అత్యంత విషపూరితమైన జంతువులలో పాము కూడా ఒకటి.వీటిలో కూడా ఎన్నో రకాల జాతులు ఉంటాయి.

అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా అనే జాతి ఒకటి.ఇంత విషపూరితమైన ఈ పాము కరిస్తే ఎవరైనా సరే కొన్ని నిమిషాల్లో చనిపోతారు.

కాబట్టి పాము కనిపిస్తే జనాలు భయంతో పరుగులు పెడతారు.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

ఇలా వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.కొన్ని వీడియోలు మాత్రం చూసీన వారికి భయాన్ని తెప్పిస్తాయి.

Advertisement

అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వైరల్ అవుతున్న వీడియో కొరియా దేశంలో జరిగిన సంఘటన అని తెలుస్తోంది.200 కింగ్ కోబ్రాలను పట్టుకున్న ఒక అమ్మాయి, ఆమె వెంట ఒక వ్యక్తి రోడ్డుపై బైకుల మీద వెళ్తున్నారు.వారు ఒక రోడ్డు టర్నింగ్ తిరగగానే రోడ్డుపై పడగవిప్పిన రెండు భారీ కింగ్ కోబ్రా లు కనిపిస్తాయి.

వాటిని చూడగానే ఇద్దరు భయంతో బైకులు వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తుతారు.వీరికి తోడు ఇంకొక వ్యక్తి వచ్చి స్నేక్స్ స్టిక్స్,బాగ్స్ పట్టుకొని అక్కడికి వచ్చి వారికి సహాయం చేస్తాడు.

ఆ తరువాత ఆ ముగ్గురు కలిసి ఒక కింగ్ కోబ్రాను పట్టుకోడానికి ప్రయత్నించినప్పుడు అది మాత్రం వారికి చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటుంది.అయినా వీరు వదలకుండా తోక పట్టుకోడానికి ప్రయత్నించినప్పుడు అది వీరి మీధికి కాటేయడానికి దూసుకొస్తుంది.

అయినా కూడా ఈ ముగ్గురు వెనక్కి తగ్గకుండా దాన్ని పట్టుకుంటారు.ఆ తరువాత మరో పాముని కూడా బంధిస్తారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఇలా పాములను పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబందించిన వీడియోను Giant King Cobra అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు