అల్సర్‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇవి తినాల్సిందే!

అల్స‌ర్ లేదా క‌డుపు పూత‌.చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతుంటారు.

గ్యాస్ట్రిక్ గోడకు గాయాల వల్ల అల్స‌ర్ స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.అల్సర్‌ తలెత్తటానికి ఎన్నో కారణాలుంటాయి.

స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఒక వేళ తీసుకున్నా హ‌డావుడిగా తినేయ‌డం, మారిన జీవ‌న శైలి, పెయిన్‌ కిల్లర్స్ వాడ‌టం, మద్యపానం, ధూమపానం, పొగాకు నమలటం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అల్స‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది.ఇక అల్స‌ర్ వ‌చ్చిందంటే.

కాస్త కారంగా ఉన్న ఆహారం తీసుకున్నా చాలా బాధాక‌రంగా ఉంటుంది.అందుకే అల్స‌ర్ ఉన్న వారు కారం, మ‌సాలా వంట‌లు తీసుకునేందుకు భ‌య‌పడుతుంటారు.

Advertisement
These Foods Help To Reduce Ulcers! Food, Ulcer, Latest News, Health Tips, Good H

అయితే అల్స‌ర్ స‌మ‌స్య ఉన్న వారు ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాలు తీసుకుంటే.త్వ‌ర‌గా రిక‌వ‌ర్ అవ్వొచ్చు.

అల్స‌ర్‌ను త‌గ్గించ‌డంలో యాపిల్ పండు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు ఒక యాపిల్ తింటే.

అందులో ఉంటే ఫ్లేవనాయిడ్లు పైలోరి బ్యాక్టీరియాను త‌గ్గించి.అల్స‌ర్ స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

అలాగే స్వ‌చ్ఛ‌మైన తేనెతో కూడా అల్స‌ర్‌ను నివారించుకోవ‌చ్చు.

These Foods Help To Reduce Ulcers Food, Ulcer, Latest News, Health Tips, Good H
దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

యాంటీబాక్టీరియల్ మరియు యాంటీవైరస్ లక్షణాలు నిండి ఉండే తేనెను రెగ్యుల‌ర్‌గా ఏదో ఒక రూపంలో తీసుకుంటే.అల్స‌ర్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.అల్స‌ర్‌తో బాధ ప‌డేవారు రెగ్యుల‌ర్‌గా క్యారెట్ జ్యూస్ లేదా క్యారెట్‌ను తీసుకుంటే.

Advertisement

గ్యాస్ట్రిక్ గోడ బలపడుతుంది మ‌రియు అందులో ఉండే విట‌మిన్ ఎ కడుపు పూతను దూరం చేస్తుంది.అలాగే అల్స‌ర్‌కు ప్ర‌ధాన కార‌ణం అయ్యే పైలోరీ బ్యాక్టీరియాను నివారించ‌డంలో వెల్లుల్లి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల‌, వెల్లుల్లిని ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక వీటితో పాటు పెరుగు, గ్రీన్ టీ, బ్రోక‌లీ, స్ట్రాబెర్రీస్, కాలీఫ్లవర్, క్యాబేజీ, వంటివి డైట్‌లో చేర్చుకుంటే.

సులువుగా అల్స‌ర్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.అదే స‌మ‌యంలో మద్యం, టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

" autoplay>

తాజా వార్తలు