ఇవి తింటే కిడ్నీల్లో రాళ్లు వచ్చే రిస్క్ ఎక్కు‌వ‌ట‌.. జాగ్ర‌త్త‌..!

కిడ్నీల్లో రాళ్లు.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే.మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు అయిన‌ కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి.

అలాగే కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు కనీసం మూత్ర విసర్జన కూడా సరిగా చేయ‌లేరు.మ‌రియు ఈ స‌మ‌యంలో వ‌చ్చే నొప్పి చాలా విప‌రీతంగా ఉంటుంది.

అందుకే కిడ్నీల్లో రాళ్లును క‌రిగించ‌డ‌మో లేదా ఆప‌రేష‌న్ చేయించుకుని తీయించుకోవ‌డ‌మో చేస్తుంటారు.అయితే కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

Advertisement

కొన్ని ఆహారాలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి.సోడియం అధికంగా ఉన్న ఆహారం ఎప్పుడూ తీసుకోరాలేదు.ఎందుకంటే.

అలాంటి ఆహారం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్ప‌డ‌తాయి.అలాగే యూరిక్‌ ఆసిడ్ ఎక్కువ‌గా ఉన్న వారు మాంసాహారాన్ని అధికంగా తీసుకోరాదు.

అలా తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాంటి వారు వారానికి కేవ‌లం ఒక‌సారి లేదా రెండు సార్లు మాత్ర‌మే మాంసాహారాన్ని తీసుకోవాలి.

ఇక చాలా మంది సప్లిమెంట్ల రూపంలో కాల్షియం తీసుకుంటుంటారు.కానీ, ఇలా అవసరమైన దానికంటే అధికంగా తీసుకున్నా కిడ్నీల్లో స్టోన్స్ ఏర్ప‌డ‌తాయి.అంతేకాదు, విటమిన్ డి ఎక్కువగా తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

మ‌రియు చిరుతిండ్లు, ఫాస్ట్ ఫుడ్‌, బేకరీ ఫుడ్స్, శీతల పానీయాలు వంటివి తీసుకోవ‌డం కూడా కిడ్నీల్లో స్టోన్స్ రావ‌డానికి కార‌ణం.కాబ‌ట్టి, ఇలాంటి ఆహారాల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

Advertisement

ఇక కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు నీరు ఎక్కువ‌గా తీసుకోవాలి.నీరు మాత్రమే కాదు మ‌జ్జిక‌, కొబ్బ‌రి నీరు వంటివి కూడా తీసుకోవాలి.

అలాగే కిడ్నీ బీన్స్, మెంతులు, తుల‌సి ఆకులు, దానిమ్మ‌, ఆపిల్ సైడర్ వినెగర్ వంటివి తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు క‌రుగుతాయి.అలాగే నిమ్మ‌, బ‌త్తాయి, క‌మ‌లా వంటి నిమ్మ జాతి పండ్లను కూడా తీసుకోవాలి.

ఎందుకంటే, వీటిలో నుంచి వచ్చే సిట్రేట్‌ కిడ్నీల్లో రాళ్ల‌ను త‌గ్గిస్తాయి.

తాజా వార్తలు