భారత్ టీ20 సిరీస్ లో చేసిన మూడు అతి పెద్ద తప్పిదాలు ఇవే..!

భారత్ 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ చేతిలో ఓడి సిరీస్ ను చేజార్చుకుంది.

వెస్టిండీస్( West Indies ) తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ ఆరంభంలోనే రెండు వరుస ఓటములను భారత్ చవిచూసింది.

ఆ తర్వాత పుంజుకొని రెండు విజయాలను సాధించి సిరీస్ సమం చేసుకుంది.కానీ చివరికి మ్యాచ్లో ఘోర ఓటమిని చవిచూసింది.

దీంతో సిరీస్ టైటిల్ ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది.అయితే క్రికెట్ నిపుణులు ఈ ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ లో భారత్ చేసిన అతి పెద్ద మూడు తప్పిదాలు ఇవే అని చెబుతున్నారు.ఈ తప్పిదాలను భారత జట్టు ఆటగాళ్లు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.టీ20 ఫార్మాట్: పొట్టి ఫార్మాట్ లో బ్యాటింగ్ కీలకం.టీ20 ఫార్మాట్( T20 format ) లో జట్టులోని ఆటగాళ్లు ఎగ్రెసివ్ గా ఆడాలి.భారత జట్టు కాంబినేషన్ కుదరక జట్టు ఇబ్బంది పడుతోంది.

వెస్టిండీస్ తో ఆడిన ఐదు మ్యాచ్లలో కూడా భారత జట్టు బ్యాటింగ్ లైనప్ అక్షర పటేల్ తో ముగిసింది.కానీ వెస్టిండీస్ జట్టులో పదో నెంబర్ వరకు భారీ షాట్లు ఆడగలిగే ప్లేయర్లు ఉన్నారు.

Advertisement

భారత్ ఓటమికి ఇదే అతి పెద్ద కారణం అని కోచ్ ద్రావిడ్ కూడా ఒప్పుకున్నాడు.

ఫినిషర్:( finisher ) భారత జట్టుకు అతిపెద్ద సమస్య సరైన ఫినిషర్ లేకపోవడం.ఈ సమస్య గత ఏడాది నుండి టీంఇండియాను వెంటాడుతూనే ఉంది.టీ20 సిరీస్ లో సంజూ శాంసన్, హర్దిక్ పాండ్యా( Sanju Samson, Hardik Pandya ) పెద్దగా ఆకట్టుకోలేక పోయారు.సెలెక్టర్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి రింకూ సింగ్, జితేన్ శర్మ లాంటి న్యాచురల్ ఫినిషర్లను జట్టులోకి తీసుకోవడం మంచిది.

చాహల్ కెరీర్ ముగించడం: టీ20 ఫార్మాట్ లో వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్( Yuzvendra Chahal ) ను పక్కన పెట్టడమే మంచిది.గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఆడని చాహల్.ఆ తర్వాత టీమ్ లోకి రీఎంట్రీ ఇచ్చి నిలకడగా రాణించలేకపోవడం విండీస్ పర్యటనలో మరోసారి స్పష్టమైంది.

చాహల్ నుంచి బ్యాటింగ్లో ఏమీ ఆశించలేం.వికెట్లు తీసుకుంటాడని జట్టులోకి తీసుకుంటే విండీస్ బ్యాటర్లకు పరుగులు సమర్పించుకున్నాడు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఫీల్డింగ్ లో కూడా చాహల్ తేలిపోతున్నాడు కాబట్టి ఈ టీ20 ఫార్మాట్ లో పక్కన పెట్టడమే మంచిదని క్రికెట్ నిపుణుల అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు