శనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లు ఇవే..నివారణ చర్యలు..!

తెలుగు రాష్ట్రాలలో నల్ల రేగడి నేలలలో వర్షాధారంగా అధిక విస్తీర్ణం లో శనగ పంట సాగు( Bengalgram Cultivation ) అవుతోంది.

మార్కెట్లో శనగ పంటకు మంచి డిమాండ్ ఉంది.

అయితే ఈ శనగ పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.కొంతమంది రైతులకు శనగ పంట సాగు విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అధిక దిగుబడి సాధించలేకపోతున్నారు.

శనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లు ఏవో.ఆ తెగుళ్ల నివారణకు చర్యలు ఏవో తెలిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు.ఆ తెగుళ్లు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

శనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో బూజు తెగులు ( Pest )కీలకపాత్ర పోషిస్తాయి.పంట పూత దశలో ఉన్నప్పుడు ఈ బూజు తెగుళ్లు శిలీంద్రాల ద్వారా పంటను ఆశిస్తాయి.

Advertisement

ఈ తెగులు ఆశించిన మొక్క ఆకులు, కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.ఈ బూజు తెగుల నివారణకు ఒక ఎకరాకు థయోబెండజోల్ 200గ్రా.

చొప్పున పంటకు పిచికారి చేయాలి.

శనగ పంట ( Bengalgram crop )పైరు పక్వానికి వచ్చే దశలో తుప్పు తెగుళ్లు పంటను ఆశిస్తాయి.తడి వాతావరణం, చల్లటి వాతావరణం ఉంటే ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ తెగుళ్లు ఆశించిన మొక్క ఆకులపై గుండ్రని చిన్న గోధుమ రంగు పొక్కులు ఏర్పడతాయి.

ఈ తుప్పు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో 200 మిల్లీలీటర్ల ప్రోపికొనజోల్ ను కలిపి పిచికారి చేయాలి.కాస్త పంటను ముందుగా విత్తిన సమయంలో లేదంటే అకాల వర్షాలు కురిసిన సమయంలో శనగ పంటకు ఆకుమాడు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అమెరికాలో పంజాబీ స్మగ్లర్ కాల్చివేత .. వేటాడి వెంటాడి చంపిన ప్రత్యర్ధులు

ఈ తెగుళ్లు ఆశించిన మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది.ఈ తెగులు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది.ఈ తెగుళ్లను పొలంలో గుర్తించిన వెంటనే.

Advertisement

ఆ మొక్కలను పీకి నాశనం చేయాలి.ఆ తరువాత ఒక ఎకరం పొలానికి 400గ్రా.

క్లోరోథయోనిల్( Chlorothionil ) ను పిచికారి చేయాలి.ఈ తెగుళ్ళను గుర్తించి తొలి దశలోనే నివారించకపోతే దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.

తాజా వార్తలు