ఆరెంజ్ పండ్ల‌తో క‌లిపి వీటిని పొర‌పాటున కూడా తీసుకోకూడ‌దు..తెలుసా?

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు దాదాపు అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే పండ్ల‌లో ఆరెంజ్( Oranges ) ఒక‌టి.

ప్ర‌స్తుత చ‌లికాలంలో ఆరెంజ్ పండ్లు విరివిగా ల‌భ్య‌మ‌వుతుంటాయి.

ఈ సీజ‌న‌ల్ ఫ్రూట్ ను రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఆరెంజ్ లో మెండుగా ఉండే విట‌మిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

ఈ పండులో ఉండే పీచు, పొటాషియం మరియు ఫ్లేవనాయిడ్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.ఆరెంజ్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

ముడతలు, వయసు బట్టి వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో తోడ్ప‌డ‌తాయి.ఆరెంజ్ పండ్లు రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలో టాక్సిన్లను బ‌య‌ట‌కు పంప‌డంలో కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

ఆరెంజ్ పండ్లు ఆరోగ్య‌క‌ర‌మే.కానీ ఆరెంజ్ తో క‌లిపి కొన్ని కొన్ని ఆహారాల‌ను పొర‌పాటున కూడా తీసుకోకూడ‌దు.

ఆ ఆహారాలు ఏంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరెంజ్ పండ్లు మ‌రియు పాలు, పాల ఉత్పత్తులు( Milk Products ) క‌లిపి లేదా ఒకేసారి తీసుకోకూడ‌దు.ఆరెంజ్ పండ్ల‌లో ఆమ్ల పదార్థాలు ఉంటాయి.ఇవి పాలల్లో ఉండే ప్రోటీన్లతో క‌లిస్తే జీర్ణకోశంలో అసౌకర్యం ఏర్ప‌డుతుంది.

గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్య‌లు త‌లెత్తుతాయి.అలాగే స్వీట్లు( Sweets ) లేదా ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలను ఆరెంజ్ పండ్ల‌తో క‌లిపి తీసుకోకూడ‌దు.

అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?
చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?

ఈ క‌ల‌యిక రక్తంలోని చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణం అవుతుంది.

Advertisement

ఆరెంజ్ పండ్లు, కోల్డ్ డ్రింక్స్( Cool Drinks ) ఒకేసారి తీసుకోకూడదు.ఆరెంజ్ పండ్ల ఆమ్లత కోల్డ్ డ్రింక్స్ లోని రసాయనాలతో ప్రతిస్పందించిన‌ప్పుడు క‌డుపులో అసౌక‌ర్యం, హార్ట్‌బర్న్ కు దారితీస్తుంది.మసాలా పదార్థాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ప‌ప్పు ధాన్యాలను కూడా ఆరెంజ్ పండ్ల‌తో క‌లిపి తీసుకోకూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు