బఠాణి సాగులో అధిక దిగుబడి ఇచ్చే మేలు రకం విత్తనాలు ఇవే..!

వ్యవసాయం వేసే రైతులు( Farmers ) కొన్ని రకాల పంటలకు మాత్రమే సాగు చేస్తే పెద్దగా ఆదాయం ఉండదు.

పంటలను మారుస్తూ కొత్తరకం పంటలను వేస్తేనే అధిక దిగుబడి సాధించడానికి వీలుంటుంది.

బఠాణి లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.మార్కెట్లో ఈ పంటకు మంచి డిమాండ్ ఉంది.

కాబట్టి ఈ పంటను సాగు చేసి మంచి దిగుబడి పొంది లాభాన్ని అర్జించవచ్చు.ఈ పంట వేయడానికి ముందు నేలను పరీక్ష చేయించుకుంటే మంచిది.

కావలసిన ఎరువులను ( Fertilizers )పంటకు కావలసిన మోతాదులో అందించడానికి వీలుంటుంది.బఠాణి లో చాలా రకాలు ఉన్నాయి ఏ రకం విత్తనాలను సాగుచేయాలో.

Advertisement

ఎటువంటి రకాలు మంచి దిగుబడి ఇస్తాయో తెలుసుకుందాం.బఠాణి( pea ) లో స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక అనే మూడు రకాల విత్తనాలు( Seeds ) మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఆ విత్తనాలు ఏమిటో చూద్దాం.

ఎన్.పి.-39:

ఈ రకానికి చెందిన మొక్కలు చాలా ఎత్తుగా ఎదుగుతాయి.ఇవి ముడతలు పడిన గింజలకు చెందిన రకం.వంద రోజులలో పంట చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో 100 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

జవహర్ మటర్ -1

: ( Jawahar Matar)ఈ రకానికి చెందిన మొక్కల కాయలు పెద్దవిగా ఉండి చివర వంపు కలిగి ఉంటాయి.ఒక ఎకరం పొలంలో 50 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

జవహర్ మటర్-2

: ఈ రకానికి చెందిన గింజలు పెద్దవిగా ముడతలు కలిగి ఉండి, ఒక ఎకరం పొలంలో దాదాపుగా 40 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

బోర్న్ విల్లీ

: ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు.గింజలు ముడతలు కలిగి ఉంటాయి.85 రోజులలో పంట కోతుకు వస్తుంది.ఒక ఎకరంలో 40 క్వింటాళ్ల పచ్చికాయ దిగుబడి పొందవచ్చు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
గుహలో నిజంగానే 188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా.? నిజమెంత?

ఐ.పి.-8:

ఇవి మధ్యస్థ రకానికి చెందినవి.ఒక ఎకరం పొలంలో 100కు పైగా క్వింటాళ్లు దిగుబడి పొందవచ్చు.

Advertisement

ఏ రకం బఠాణి విత్తనాలను సాగుకు ఎంపిక చేసుకున్న ముందుగా ఒక ఎకరం పొలంలో ఎనిమిది టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.ఒక ఎకరం పొలానికి స్వల్పకాలిక రకాలు అయితే 48 కిలోల విత్తనాలు( seeds ) అవసరం.

అక్టోబర్ లేదా నవంబర్ నెల విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఏవైనా తెగుళ్లు సోకితే వెంటనే పిచికారి మందులు ఉపయోగించి తొలి దశలోనే అరికట్టాలి.

తాజా వార్తలు