అతి ఆక‌లిని దూరం చేసి శ‌రీర బ‌రువును త‌గ్గించే అద్భుత ఆహారాలు ఇవే!

అతి ఆక‌లి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని వేధించే స‌ర్వ సాధార‌ణ‌మైన స‌మ‌స్య ఇది.

దీని వ‌ల్ల తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి మొదలవుతుంది.దాంతో ఇంట్లో ఏముంటే అవి తినేస్తుంటారు.

అలాంటి స‌మ‌యంలో ఆక‌లిని తీర్చుకోవ‌డాకే ప్ర‌య‌త్నిస్తారు.కానీ, తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మంచిదా.

కాదా.అన్న‌ది ఆలోచించ‌రు.

Advertisement

కంటికి ఏది ఇంపుగా క‌నిపిస్తే దానిని లాగించేస్తుంటారు.ఫ‌లితంగా శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి బ‌రువు పెరిగిపోతూ ఉంటారు.

దాంతో పెరిగిన బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే మీరు మొద‌ట చేయాల్సింది బ‌రువు త‌గ్గ‌డం కాదు.

అతి ఆక‌లి స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌డం.అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.అతి ఆక‌లిని దూరం చేసి శ‌రీర బ‌రువును త‌గ్గించ‌డంలో ప్రోటీన్ గ్రేట్ గా స‌హాయ‌పడుతుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

అందుకే రెగ్యుల‌ర్‌గా శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ప్రోటీన్ ను అందించాలి.అందుకోసం పాలు, పెరుగు, ఎగ్‌, న‌ట్స్‌, ఆకుకూర‌లు, బీన్స్, చేప‌లు, ఓట్స్‌, కండిప‌ప్పు వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవాలి.

Advertisement

అలాగే అతి ఆక‌లి స‌మ‌స్య నుంచి మిమ్మల్ని త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డేసే సామ‌ర్థ్యం కొబ్బ‌రి నూనెకు స‌మృద్ధిగా ఉంది.ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనెను తాగితే.

అతి ఆక‌లి త‌గ్గుతుంది.

ఘాటైన రుచిని క‌లిగి ఉండే న‌ల్ల మిరియాలను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.త‌ద్వారా న‌ల్ల మిరియాల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేక సుగుణాలు అతి ఆక‌లి, బాడీ వెయిట్‌ రెండిటినీ త‌గ్గిస్తాయి.ఫ్లాక్స్ సీడ్స్.

వీటినే అవిసె గింజ‌లు అంటారు.అతి ఆక‌లి స‌మ‌స్యతో బాధ‌ప‌డేవారు రెగ్యుల‌ర్‌గా వ‌న్ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్‌ను తీసుకోవాలి.

దాంతో ఆ స‌మ‌స్య దూర‌మై వెయిట్ లాస్ అవుతారు.మ‌రియు శ‌రీరానికి బోలెడ‌న్ని పోష‌కాలు సైతం ల‌భిస్తాయి.

తాజా వార్తలు