ఎన్టీఆర్ కి ఎవరు పోటీ లేరు... పోటి రారు కూడా కోటా శ్రీనివాస్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎన్నో అద్భుతమైన సినిమాలలో విలక్షణ నటుడిగా ఎంతో గొప్ప పాత్రలలో నటించే మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటికి పరిమితమయ్యారు.

ఇలా ఇంటిపట్టునే ఉంటూ పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన సినీ కెరియర్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.

ఇకపోతే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి కోట శ్రీనివాసరావు ఇండస్ట్రీకి సంబంధించిన నటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన స్టార్ హీరోల రెమ్యూనరేషన్ల (Remunerations)గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.అదేవిధంగా నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి కూడా కోట శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు ఉన్నటువంటి హీరోలలో తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని కోటా శ్రీనివాస్ రావు తెలియజేశారు.ఇప్పుడున్న హీరోలలో మహేష్ బాబు(Mahesh Babu) బన్నీ (Bunny) ఎన్టీఆర్ బాగా నచ్చుతారని అయితే ఎన్టీఆర్ లో ఉన్న పొటెన్షియాలిటీ ఇంకెవరికి లేదని తెలిపారు.

Advertisement

ఎన్టీఆర్ నటన డాన్స్, అతని డైలాగ్ డెలివరీ, మాట తీరు అన్ని ఎంతో అద్భుతంగా ఉంటాయని, వీటన్నింటిలోనూ ఎన్టీఆర్ కి ఎవరు పోటీలేరని,ఇకపై తనకు పోటీగా ఎవరు రారు అంటూ ఎన్టీఆర్ గురించి కూడా శ్రీనివాసరావు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ కూడా వారి తాతగారి నటన పునికి పుచ్చుకున్నారు కనుక ఈయన కూడా నటనలో అంతే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అంటూ కోట శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు