రవితేజ సినిమాను తొక్కేయాలని అలాంటి ప్రచారమా.. మాస్ మహారాజ్ కు అన్యాయం జరుగుతోందా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Mass Maharaja Ravi Teja) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.

రవితేజ - పీపుల్స్ మీడియా( Peoples Media ) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఈగిల్.ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు గట్టిగా ఫిక్స్ అయ్యారు.

ఈ మేరకు థియేటర్ అగ్రిమెంట్‌లు కూడా చేసేస్తున్నారు.అయితే ఈ సినిమాకు ఓటిటి( OTT ) హక్కులు ఇంకా విక్రయించలేదు.దాంతో సంక్రాంతికి రాదు అనే అనుమానాలు ఉన్నాయి.

Advertisement

కానీ దాంతో సంబంధం లేదు.సంక్రాంతికే వస్తాం అని మేకర్లు ఎన్ని సార్లు చెప్పినా ఏదో ఒక మూల నుంచి ఆ సినిమా సంక్రాంతికి రాదు అనే ప్రచారం పుడుతూనే ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.దాంతో ఈగిల్ సినిమా టీం( Eagle Film Team ) ఇదంతా కావాలని ఎవరు పనికట్టుకుని మరి చేస్తున్నారని అనుమాన పడుతుంది ఈగిల్ సినిమా విడుదల 13వ తేదీన అదే రోజున సైంధవ్ వుంది.12 గుంటూరు కారం వుంది.12 నే హనుమాన్ కూడా వుంది.అంటే 12 న రెండు సినిమాలు కలిసి రెవెన్యూ షేర్ చేసుకోవాలి.

ఆ మర్నాడే నాలుగు సినిమాలు కలిసి రెవెన్యూ షేర్ చేసుకోవాలి.అంతే కాదు థియేటర్లు కూడా షేర్ చేసుకోవాలి.

ఇలాంటి టైమ్ లో ఈగిల్ చాలా వరకు థియేటర్లు బుక్ చేసుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సైంధవ్‌కు సురేష్ బాబు( Suresh Babu ) బ్యాకింగ్ వుండడంతో థియేటర్ల సమస్య లేదు.గుంటూరు కారం ఎలాగూ అన్నింటికన్నా క్రేజ్ వున్న సినిమా కనుక దానికీ సమస్య లేదు.హనుమాన్ చిన్న సినిమా అయినా, ముందే బయ్యర్లను ఫిక్స్ చేసుకున్నారు కనుక దానికి సరపడా థియేటర్లు దానికి వున్నాయి.

Advertisement

మరి ఇలాంటపుడు ఎందుకు ఈగిల్ మాత్రమే రాదు రాదు అనే ప్రచారం జరుగుతోంది? ఇది కావాలని ఎవరో చేస్తున్నారు అని మేకర్లు గట్టిగా అనుమాన పడుతున్నారు.ఇలాంటి వార్తలు వచ్చినపుడల్లా మళ్లీ మరోసారి సంక్రాంతి విడుదల అని అనౌన్స్ చేసుకోవాల్సి వస్తోంది.

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రవితేజను తొక్కేయాలని ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా వార్తలు