మరికాసేపటిలో తీరం దాటనున్న తుపాన్..!

మిచాంగ్ తుపాను మరికాసేపటిలో తీరం దాటనుంది.

ఈ మేరకు బాపట్ల సమీపంలో తీరం దాటనుండగా ఆ సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.

తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా కుండపోత వానలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు.వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

అలాగే పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుంది.తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Advertisement

ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు సూచనలు చేస్తున్నారు.అయితే రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు