టాలీవుడ్ స్టార్ హీరోలలో బెటర్ లైనప్ ఉన్న స్టార్ హీరోలు వీళ్లేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.

 Tollywood Star Heroes Movies Lineup Ntr Mahesh Prabhas Pawan Kalyan Balayya Details, Junior Ntr, Prabhas, Pawan Klayan, Tollywood Heroes Lineup, Balakrishna, Chiranjeevi, Mahesh Babu, Ram Charan, Salaar, Pushpa 2,-TeluguStop.com

టాలెంట్ ఉన్న దర్శకులకే ఎన్టీఆర్ ఓటు వేయగా ఈ రెండు ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్లతోనే తెరకెక్కనున్నాయి.

రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలలో శంకర్ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నా గౌతమ్ మూవీ విషయంలో మాత్రం ఫ్యాన్స్ హ్యాపీగా లేరనే చెప్పాలి.

 Tollywood Star Heroes Movies Lineup Ntr Mahesh Prabhas Pawan Kalyan Balayya Details, Junior Ntr, Prabhas, Pawan Klayan, Tollywood Heroes Lineup, Balakrishna, Chiranjeevi, Mahesh Babu, Ram Charan, Salaar, Pushpa 2, -టాలీవుడ్ స్టార్ హీరోలలో బెటర్ లైనప్ ఉన్న స్టార్ హీరోలు వీళ్లేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు ప్రభాస్ గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆదిపురుష్, ప్రభాస్ మారుతి కాంబో మూవీ విషయంలో ఫ్యాన్స్ అయితే హ్యాపీగా లేరని తెలుస్తోంది.

అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు మాత్రమే పరిమితం కాగా కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మహేష్ త్రివిక్రమ్ , రాజమౌళి డైరెక్షన్ లో తర్వాత ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు.

భవదీయుడు భగత్ సింగ్, వినోదాయ సిత్తం రీమేక్ లో నటిస్తుండగా హరిహర వీరమల్లు.భవదీయుడు భగత్ సింగ్ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

బాలయ్య గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.చిరంజీవి వరుస రీమేక్ లలో నటిస్తుండగా బాబీ, వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ల విషయంలో ఫ్యాన్స్ సంతృప్తితో ఉన్నారు.ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణల లైనప్ ఇతర హీరోలతో పోలిస్తే బెటర్ గా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube