టాలీవుడ్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు పొందిన సినిమా పరిశ్రమ.

టెక్నికల్ వ్యాల్యూస్ లో కానీ.కథపరంగా కానీ.

బడ్జెట్ విషయంలో కానీ.బాలీవుడ్ ను మంచి పరిణతి కనబరుస్తోంది టాలీవుడ్.

అందుకే ఈ బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో స్టార్స్ కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.టాలీవుడ్ టాప్ స్టార్స్ తీసుకుంటున్న లేటెస్ట్ రెమ్యునరేషన్స్ వామ్మో అనిపిస్తున్నాయి.

Advertisement

ఇంతకీ ఏ హీరో.ఎంత పారితోషకం తీసుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్

ప్రస్తుతం తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్.ఆయన ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట.ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ పై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఆయన రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌ అనే సినిమాలకు ఆయన వందకోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు

ప్రభాస్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో మహేష్‌ బాబు.సరిలేరు నీకెవ్వరు మూవీకి 50 కోట్లు తీసుకున్న ఆయన.ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమాకు 65 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?

అటు పవన్ కల్యాణ్ కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాయి.వకీల్ సాబ్ తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన .ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ సినిమాలకు 50 నుంచి 60 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి

Advertisement

ఖైదీ నెంబర్‌ 150తో మంచి విజయాన్ని అందుకుంటున్న ఆయన ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు గాను తను 50 కోట్ల రూపాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్

అల వైకుంఠపురములో సినిమాకు 25 కోట్లు తీసుకున్న ఆయన.ప్రస్తుతం తను నటిస్తున్న పుష్ణ సినిమాకు గాను ఆయన 35 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుండటంతో రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఆయన ఈ సినిమా కోసం 50 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్- రాం చరణ్

అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ ఉన్నారు.వీరు ప్రస్తుతం చేస్తున్న ట్రిఫుల్ ఆర్ సినిమా కోసం చెరో 35 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట.

విజయ్ దేవరకొండ

అటు విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కోసం తీను ఏకంగా 30 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట.మిగిలిన హీరోలంతా 20 కోట్లు లోపే ఉన్నారు.

సీనియర్‌ హీరోలు వెంకటేష్‌, నాగార్జున ఇంకా ఐదు కోట్ల దగ్గరే ఆగిపోయారు.యంగ్ హీరోలతో వారు పోటీ పడలేకపోతున్నారు.బాలకృష్ణ అఖండ చిత్రానికి రూ.12కోట్లు తీసుకుంటున్నాడట.రవితేజ ప్రస్తుతం రూ.15కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడట.రామ్‌ ప్రస్తుతం 13కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట.

నాని 12 కోట్లు, నాగచైతన్య 8 కోట్లు తీసుకుంటున్నారట.మిగిలిన హీరోలు 5 కోట్ల రూపాయలకు లోపే తీసుకుంటున్నారట.

తాజా వార్తలు