రాష్ట్రంలో కాకరేపుతున్న అంశం మునుగోడు ఉప ఎన్నిక.ప్రధాన పార్టీలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కుతోంది.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మొదలన వేడి.ప్రస్తుతం రణరంగంగా మారుతోంది.
ఎన్నికల షెడ్యుల్ వచ్చేదే ఆలస్యం బరిలోకి దిగాలని చూస్తున్నాయి.అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నిక గెలుపు తప్పనిసరి.
ఎందుకంటే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ గెలుపునే ప్రామాణికంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక విజయం మూడు ప్రధాన పార్టీలకు అత్యవసరంగా మారింది.
ఈ విషయంలో ఏ మాత్రం లెక్క తేడా వచ్చినా.దాని ప్రభావం ముందు జరగబోయే ఎన్నికలపై పడుతుందని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఏ సామాజిక వర్గం ఎంతుంది.ఎవరిని బరిలోకి దింపాలనే నిర్ణయాలు ఊపందుకున్నాయి.*59/8 మూడో స్థానం ఎవరిదో.
అయితే ఈ ఎన్నికల్లో ఎవరో ఒకరి గెలుపు ఖాయం. మరి రెండో స్థానంలో.మూడో స్థానంలో ఎవరు నిలుస్తారన్నదే ఆసక్తి కరంగా మారింది.మూడో స్థానంలో వస్తే పరిస్థితి ఏంటని అన్ని పార్టీల్లో ఆందోళన మొదలైంది.
మూడు ప్రధాన పార్టీల్లో ఎవరు కూడా మూడో స్థానంలో ఇష్టపడరు.అవసరమైతే ఓడినా ఫర్లేదు కానీ మూడో స్థానంలో మాత్రం నిలవకూడదన్న పట్టుదలతో కనిపిస్తున్నాయి.
దీని కోసం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు.దీంతో.
మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది.
టీఆర్ఎస్ విషయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటోంది.
అయితే ఈ ఉప ఎన్నికలో గెలిస్తే ఓకే.లేదంటే రెండో స్థానంలోనైనా నిలవాలని బలంగా కోరుకుంటోంది.కాగా ఇక్కడ కూసుగుంట్ల అభ్యర్థిత్వాన్ని మునుగోడు టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి ఆయన్నే అభ్యర్థిగా ఫైనల్ చేస్తే మాత్రం ఎదురుదెబ్బ ఖాయమంటున్నారు.అభ్యర్థి మీద ఉన్న కోపంతో కింది స్థాయి నేతలు అంటిముట్టనట్లు వ్యవహరిస్తే మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదం ఉందని ఇదే జరిగితే టీఆర్ఎస్ ఇమేజ్ మామూలుగా డ్యామేజ్ అవ్వదు.

కాంగ్రెస్ కు తప్పనిసరి ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు మునుగోడు పెద్ద సవాల్ గా మారింది.క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గంలో సొంత సీటును పోగొట్టుకుంటే జరిగే నష్టం స్టేట్ చీఫ్ రేవంత్ కి తెలిసిందే.కానీ ప్రతికూల పరిస్థితులు ఆయన్ను ఇబ్బందికి గురి చేసే వేళలో ఏమాత్రం తేడా కొట్టినా రెండో స్థానంలో లేకుంటే జరిగే నష్టం మీద ఆయనకు అవగాహన ఉంది.ఈ కారణంతో మునుగోడు ఉప ఎన్నికను ఇటీవల కాలంలో ఎప్పుడు తీసుకోనంత సీరియస్ గా తీసుకోకుంటున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీ తమదే గెలుపని ఇక రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయానని.తమకు తిరుగులేదని బీజేపీ చెబుతోంది.
దీనికి తోడు పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో గెలుపు తప్పించి మరో ఆలోచన లేదంటున్నారు.అయితే మునుగోడులో గెలుపు ఎంత కష్టమో.
అక్కడ బీజేపీకి క్యాడర్ లేదన్న విషయం కూడా కమంలం నేతలకు తెలుసు.అందుకే గెలుపు.
లేకుంటే రెండో స్థానం చేజిక్కించుకోవాలని చూస్తోంది.ఎదేమైనా నెగ్గితీరాలని చూస్తోంది.
ఇక ఈ ఉప ఎన్నికలో కూడా ధన ప్రవాహం భారీగా ఉంటుందంటున్నారు.ఇలా అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లో మూడో స్థానంలో మాత్రం ఉండకూడదని కోరుకుంటున్నారు.