మీరు కారం ఎక్కువగా తింటారా? అయితే వెంటనే ఇవి తెలుసుకోండి!

సాధారణంగా కొందరు కారం చాలా అంటే చాలా తక్కువగా తింటారు.కేవ‌లం నాన్ వెజ్ వంట‌ల్లో మాత్రం కాస్త ఎక్కువ కారాన్ని వినియోగిస్తారు.

కానీ కొందరు మాత్రం అలా కాదు.రోజువారి వంటల్లోనూ కారాన్ని అధికంగా ద‌ట్టించి లాగించేస్తుంటారు.

ఈ అలవాటు మీకు ఉందా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలను తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిందే.దాదాపు వైద్యులు అందరూ కారాన్ని తక్కువగా తీసుకోమని ప్రతి ఒక్కరికి సూచిస్తుంటారు.

అందుకు చాలా కారణాలు ఉన్నాయి.వాస్త‌వానికి కారం మ‌న శ‌రీరానికి ఎంత మంచి చేస్తుందో, అంత‌కంటే ఎక్కువ‌ న‌ష్టం కూడా క‌ల‌గ‌జేస్తుంది.

Advertisement

అతి అనేక అన‌ర్థాల‌కు దారి తీస్తుంది.ఇందుకు కార‌ణం ఏమీ మిన‌హాయింపు కాదు.

కారాన్ని ఓవర్ గా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది.జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి తదితర జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తూ ఉంటాయి.

అలాగే కారాన్ని ఓవర్ గా తీసుకోవడం వల్ల అల్సర్ బారిన పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి.గొంతు, కడుపులో పుండ్లు ప‌డ‌తాయి.

ఆ పుండ్ల వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి వ‌స్తుంది.కారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి విప‌రీతంగా పెరుగుతుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఆకలి పెరిగితే ఆహారాన్ని కూడా అధికంగా తీసుకుంటారు.దీని కారణంగా బరువు పెరుగుతారు.

Advertisement

అంటే వెయిట్ గెయిన్‌ అవ్వడానికి కారం అధికంగా తీసుకోవడం కూడా ఒక కారణం.కారంపొడి ప‌రిమితి మించి వినియోగం వ‌ల్ల త‌ర‌చూ డయేరియా అటాక్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కారాన్ని ఎక్కువగా తీసుకునే వారికి ముడతలు సైతం త్వరగా వస్తాయట.కాబట్టి, స్పైసీ ఫుడ్స్ ఎంత ఇష్టమైనప్పటికీ కారాన్ని పరిమితికి మించి తీసుకునే అలవాటును వదులుకోండి.అదే మీకు, మీ ఆరోగ్యానికి మంచద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు