మ‌నిషి కంటిలో జీవన ర‌హ‌స్యం.. గుట్టు విప్పిన‌ ఆస్ట్రేలియా శాస్త్ర‌వేత్త‌లు!

మ‌నిషి ఇంకెత‌కాలం జీవిస్తాడో అత‌ని క‌ళ్లు చెబుతాయ‌ట‌.కంటిని స్కాన్ చేయడం ద్వారా మరణ కాలాన్ని లెక్కించవచ్చు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సెంటర్ ఫర్ ఐ రీసెర్చ్ పరిశోధకులు ఇటీవలే త‌మ‌ పరిశోధనలో ఈ విష‌యాన్ని వెల్లడించారు .కంటిలో ఉండే రెటీనా మనిషి ఆరోగ్యానికి అద్దం పడుతుందని, అందుకే కళ్లను స్కానింగ్ చేయడం ద్వారా అత‌ని జీవితం ఇంక ఎంత మిగిలివుందో చెప్పవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డెయిలీ మెయిల్ నివేదిక ప్రకారం ఈ అధ్యయనం చేయడానికి మెల్బోర్న్ సెంటర్ ఫర్ ఐ రీసెర్చ్ ప్రత్యేక కృత్రిమ మేధస్సు అల్గారిథమ్‌ను రూపొందించింది .దీని ద్వారా 19 వేల కంటి రెటీనా చిత్రాలను విశ్లేషించారు.అలాగే యూకే బయోబ్యాంక్‌లో 36 వేల మంది జీవిత కాలాన్ని రెటీనా ద్వారా తెలుసుకున్నారు.

పరిశోధనా ఫలితాల గురించి పరిశోధకురాలు డాక్టర్ లిసా జు తెలిపారు.రెటీనా మ‌నిషి వృద్ధాప్యాన్ని తెలియ‌జేస్తుంద‌న్నారు.

రెటీనా ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంద‌ని, దాని సహాయంతో, గుండె మరియు మెదడుకు సంబంధించిన వ్యాధులను గుర్తించవచ్చ‌న్నారు.బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం రెటీనా వెనుక ఉన్న పొర చాలా సున్నితంగా ఉంటుంది.

Advertisement

దాని సహాయంతో అనేక వ్యాధులను గుర్తించవచ్చు.పరిశోధన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు