ట్రాఫిక్ బ్లాక్ చేసిన స్కూటర్ డ్రైవర్.. జవాన్ కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగింది..?

బెంగుళూరు( Bengaluru )లో ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక్కడ రోడ్లపై వెహికల్స్ ఎక్కువగా తిరగడమే కాకుండా చాలా మంది రూల్స్ బ్రేక్ చేస్తుంటారు.

అది చాలదు అన్నట్టు కరెక్ట్‌ రూట్‌లో వెళ్లే వారితో గొడవ పడుతుంటారు.వీళ్లు ట్రాఫిక్ పోలీసులకు కూడా భయపడరు.

తాజాగా ఒక స్కూటర్ డ్రైవర్ కూడా ఇలాగే చేశాడు.అయితే సరిగ్గా అక్కడే ఉన్న ఒక జవాన్ ఈ స్కూటర్ డ్రైవర్‌ను గుర్తించారు.

ఆ తర్వాత అతని తల మీద వీర బాదుడు బాది బాగా బుద్ధి చెప్పారు.సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది.

Advertisement

ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఎలక్ట్రిక్ స్కూటీని రోడ్డు మీద తప్పు దారిలో నడుపుతున్నాడు.దీంతో వన్ లైన్ లో వచ్చే వాహనాలు అతనికి ఎదురుపడ్డాయి.

ఆ వ్యక్తి క్షమించమని అడగడానికి బదులు, కారులో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు.కొద్ది సేపటికి, అక్కడే ఉన్న ఒక ఆర్మీ జవాన్( Army officer ) ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, అంతలా గొడవ చేస్తున్నందుకు అతనిని కొట్టాడు.

రాంగ్ సైడ్‌లో రావడమే కాక "ఏంటి కొడుతున్నావ్?" అన్నట్లు ఈ స్కూటర్ డ్రైవర్ ప్రశ్నించాడు.తర్వాత, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఒకరు వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు.

ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి, "బెంగుళూరు రోడ్లపై రోజూ ఆర్మీ ట్రక్కులు తిరగడం ఎంతో బాగుంది.ఇలానే తిరిగితే నేను సంతోషంగా ఎక్కువ పన్నులు కడతాను" అని రాశారు.ఈ వీడియోను ఇప్పటికే 8.25 లక్షల మందికి పైగా చూశారు.మరొక వ్యక్తి, "తప్పు దారిలో వచ్చే వాళ్లని జరిమానా వేసి, వాహనం స్వాధీనం చేసుకునే కంటే ముందు కొట్టి శిక్షించాలి" అని కామెంట్ చేశారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఈ వీడియో చాలా బాగుందని, ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా చూడాలనిపిస్తుందని మరికొంతమంది పేర్కొన్నారు.కొంతమంది మరింత హింసాత్మకంగా స్పందిస్తూ, ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే బాగుండేది అని, అలా చేస్తే కొట్టినప్పుడు మరింత దెబ్బ తగిలి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.ఈ సమస్యలు బెంగుళూరులో మాత్రమే కాకుండా, భారతదేశంలోని అన్ని పెద్ద నగరాల్లో ఉన్నాయని కొందరు అన్నారు.

Advertisement

తప్పు దారిలో వచ్చే వారిని కొట్టి, శిక్షించి, వాహనం స్వాధీనం చేసుకోవాలని కొంతమంది కోపంగా అంటున్నారు.

తాజా వార్తలు