స్కూటీని అత్యంత తెలివిగా దొంగలించిన స్కూల్ గర్ల్.. వీడియో చూస్తే..?

ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు.మంచిగా కనిపించే వాళ్లే దొంగతనాలు చేస్తూ షాక్‌లు ఇస్తున్నారు.

తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు.ఈ సంఘటనలో 13-14 ఏళ్ల వయసున్న ఒక స్కూల్ గర్ల్ ఓ స్కూటీని దొంగతనం చేసింది.

ఆ వయసులో, అది కూడా అమ్మాయి అయి ఉండి, చదువుకుంటూనే ఇలాంటి దొంగతనం చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఘర్ కా కలేష్ అనే అకౌంట్ ఎక్స్‌ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది.దొంగతనం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చూపించిన ధైర్యం చూసి ప్రజలు షాక్ అవుతున్నారు.

Advertisement

వారణాసి( Varanasi )లోని భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీర్ నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వైరల్ వీడియోలో ఒక స్కూల్ యూనిఫామ్‌ ( School uniform )వేసుకున్న బాలిక ఓ స్కూటీ ముందుకు వచ్చింది.దాన్ని కొంచెం జరుపుకోవాలని యజమానికి చెప్పింది,, ఆ ఇంట్లో ఉండే ఆంటీని స్కూటీ తాళం ఇవ్వమని అడిగింది.ఆ అమ్మాయి దొంగ అని ఎవరూ అనుకోరు అమాయకంగానే ఉంది కాబట్టి బండిని పక్కకు తిప్పి తన దారిన తాను వెళ్ళిపోతుందేమో అని సదరు ఆంటీ అనుకుంది.

కానీ కొద్ది సేపటికే ఆ అమ్మాయి స్కూటీ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యింది.ఇంత జరిగింది అని తెలిసి ఆంటీకి షాక్ అయ్యింది.ఈ మొత్తం సంఘటన ఒక CCTV కెమెరాలో రికార్డ్ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.అమ్మాయి చాలా ధైర్యంగా కొన్ని సెకన్లలో స్కూటీ దొంగతనం చేసింది అని అంటున్నారు.ఆ వీడియో కింద ఇలా రాశారు: స్కూల్ యూనిఫాం వేసుకున్న ఆ అమ్మాయి ఫ్లాట్‌లో ఉండే ఆంటీ దగ్గరకు వెళ్లి, "స్కూటీ పక్కకు పెడతా, కీస్‌ ఇవ్వండి" అని అడిగింది.ఆంటీ, ఆ అమ్మాయి అమాయకురాలుగా కనిపించింది, పైగా స్కూల్ స్టూడెంట్ అని భావించి స్కూటీ కీ ఇచ్చేసింది.

ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!
ఏంటి లాస్య చివరికి ఇలా అయిపోయావు? ఫొటోస్ వైరల్

కానీ ఆ అమ్మాయి స్కూటీ తీసుకొని పారిపోయింది.దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి వాటిని చూసి చాలామంది "అమ్మో! ఈ రోజుల్లో ఏంటి దొంగలు ఇలా ఉన్నారు" అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

అసలు ఆ అమ్మాయి దొంగ ఏమో, స్కూల్ డ్రెస్ వేసుకొని ప్రజలను మోసగిస్తుందేమో అని అన్నారు.తెలియని వ్యక్తులను గుడ్డిగా అసలు నమ్మకూడదు అని కామెంట్లు చేస్తున్నారు.

దీన్ని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు