ఓహియో రాష్ట్రలో ఓపియాయిడ్ సంక్షోభం: 24 గంటల్లో 10 మంది శ్వాస విడిచారు

ఓహియా రాష్ట్రంలో డ్రగ్స్ ఓవర్‌డోస్ తీసుకుని ఒకే రోజులో పది మంది మరణించడం కలకలం రేపుతోంది.

ఫెంటానిల్ అనే శక్తివంతమైన రసాయనం మాదకద్రవ్యాల్లో కలవడం కారణంగా కొలంబస్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది.

ఫ్రాంక్లీన్ కౌంటీ కోరోనర్ డాక్టర్ అనాహి ఓరిట్జ్ ఈ మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఓపియాయిడ్ మరణాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు నార్కాన్ లేదా నలోక్సోన్ అనే విరుగుడు మందులను దగ్గర ఉంచుకోవాలని ఆమె సూచించారు.

ఒక డ్రగ్స్ సరఫరాదారు అధిక మొత్తంలో ఈ ఓపియాయిడ్ మాదక ద్రవ్యాలను కౌంటీకి చేరవేస్తున్నట్లుగా ఓరిట్జ్ అభిప్రాయపడ్డారు.దీనిని అడ్డుకోవడానికి డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, ఓహియో హై ఇన్‌టెన్సిటి డ్రగ్ ట్రాఫికింగ్ ఏజెన్సీతో పాటు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ తీవ్రంగా ప్రయతిస్తున్నాయని ఓరిట్జ్ తెలిపారు.

కాగా గడిచిన సంవత్సరంలో ఓపియాయిడ్ కారణంగా అమెరికాలో అధిక మరణాలు సంభవించాయి.వీటిని వియత్నాం యుద్ధంలో చోటు చేసుకున్న మరణాలుగా అభివర్ణించారరు ఓహియో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్.మరోవైపు డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా ఆగస్టు నెలలో ఆరుగురు చనిపోవడంతో ఓరిట్జ్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

ఆ మరణాలతో పాటు ప్రస్తుతం చోటు చేసుకున్న మరణాలు కూడా ఫెంటానిల్‌ రసాయనం కారణంగానే సంభవించాయని ఆమె వెల్లడించారు.

అధికార భాషగా ఇంగ్లీష్ .. ట్రంప్ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో ఇమ్మిగ్రేషన్ కోర్టులలో ఇబ్బందులు
Advertisement

తాజా వార్తలు