కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.ఈ మేరకు రాత్రిని ప్రత్యేక విమానంలో అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.
రాత్రి 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా రాత్రికి నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేయనున్నారు.రేపు ఉదయం 7.50 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించనున్నారు.తరువాత 75వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో అమిత్ షా పాల్గొననున్నారు.కాగా రేపు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది.
రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్పీఏలోని రాజస్థాన్ భవన్ లో అమిత్ షా లంచ్ చేయనున్నారు.రేపు మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి సూర్యాపేటకు పయనం కానున్నారు.మధ్యాహ్నం 3.55 గంటలకు సూర్యాపేట సభాస్థలికి అమిత్ షా చేరుకోనున్నారు.సూర్యాపేటలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.రేపు సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.సాయంత్రం 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.







