తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party )పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ఏ క్లారిటీకి రాలేకపోతున్నారు.తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) మాత్రం టిడిపి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే 19 దరఖాస్తులు అందాయి అని ప్రకటించారు.
ఇప్పటికే 30 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 63 నియోజకవర్గాల కు సంబంధించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు.
టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణలో టిడిపి అభ్యర్థులను పోటీకి దింపే విషయంలో అనుమతి నిరాకరిస్తే ప్రత్యామ్నాయ ఆలోచనలో కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారట .ఈరోజు చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ కానున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి దించే విషయంపై చర్చించనున్నారు.

ఈ చర్చల్లో చంద్రబాబు( Chandrababu ) గనుక అభ్యర్థులను పోటీకి దింపేందుకు ఇష్టపడకపోతే, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో జ్ఞానేశ్వర్ ఉన్నారట.ఈ మేరకు ఆయన ప్రత్యామ్నయం వెతుక్కునే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .ప్రస్తుతం తెలంగాణలో బిజెపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.అయితే టిడిపి తో పొత్తు విషయంలో బిజెపి( BJP ) అధిష్టానం పెద్దలు ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఎటువంటి సంప్రదింపులు చేయకపోవడంతో టిడిపి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది .

ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి( TDP ) తెలంగాణలో పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని, పోటీ చేయకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయంలో అధినేత చంద్రబాబు ఉన్నట్లుగా జ్ఞానేశ్వర్ అనుమానిస్తున్నారు.టిడిపి గతంతో పోలిస్తే తెలంగాణలో బాగా బలపడిందని , అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత టిడిపి పరిస్థితి మెరుగుపడిందని , ఈ సమయంలోనూ పోటీకి వెనుకంజ వేస్తే ఇక తెలంగాణలో టిడిపి కనుమరుగడం ఖాయమనే అభిప్రాయంతో జ్ఞానేశ్వర్ ఉన్నారట.అందుకే ఈ రోజు చంద్రబాబు తో ములాఖత్ అయ్యి ఏదో ఒక క్లారిటీ తీసుకోవాలనే నిర్ణయించుకున్నారట.







