ఆ గుడి లోని గర్భగుడి నిండా డబ్బుల కట్టలే... ఎక్కడంటే...?

మన ప్రపంచంలో ఎన్నో రకాల మతాలు, జాతులు కలిగిన ప్రజలు జీవిస్తున్నారు.మనదేశంలో కూడా చాలా రకాల మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు.

చాలా మతాలకు చెందిన ప్రజలు మనదేశంలో ఉండడం వల్ల ఒక్కో మతానికి చెందిన వారు ఒక్కో ప్రసిద్ధి చెందిన ఆలయానికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.మనదేశంలోని ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

అలాంటి ప్రత్యేకత కలిగిన ఆలయాలలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ఒకటి.మన భారత దేశంలో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి.

ఈ ఆలయం ఎంతో పురాతనమైనది.ఈ ఆలయానికి 135 ఏళ్ల చరిత్ర ఉంది.

Advertisement

ప్రస్తుతం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈ ప్రాచీన ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు.ఇది ఆలయం వెలుపలి సంగతి మాత్రమే.

గర్భగుడిలోకి వెళ్లి చూసినా భక్తులకు అక్కడ కనిపించిన దృశ్యం చూస్తే వారు ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే.అమ్మవారి విగ్రహం బంగారంతో ధగధగ మెరిసిపోతూ దర్శనమిస్తుంది.

అంతేకాదు, గర్భగుడి గోడల నిండా డబ్బుల కట్టలే కనిపిస్తాయి.ప్రతి సంవత్సరం ఈ విధమైన అలంకరణకు రూ.8 కోట్లు ఉపయోగిస్తారట.

ఆలయ కమిటీ దీని పై స్పందిస్తూ, అమ్మవారి అలంకరణ కోసం ఈ డబ్బు, నగలు భక్తులే స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం ఇస్తారని, నవరాత్రులు పూర్తయ్యాక ఎవరి డబ్బు, నగలను భక్తులకే తిరిగి ఇచ్చేయాలని తెలిపారు.మరి కొంతమంది గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి పండుగ కూడా గ్రామస్తులంతా ఒకే కుటుంబమై సంతోషంగా పండుగను జరుపుకుంటామని చెప్పారు.ఇలా చేసుకోవడం వల్ల ఆ గ్రామస్తులు అంతా ఆరోగ్యం గా సుఖ సంతోషాలతో ఉంటారని వారి నమ్మకం.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025

మనదేశంలో చాలా గ్రామాల ప్రజలు ఇలా కలిసి మెలిసి సంతోషంగా పండుకులను జరుపుకుంటూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు