ఈ పారిశుధ్య కార్మికుడి రూటే సపరేటు.. రోడ్డు ఎలా క్లీన్ చేస్తున్నాడంటే..

డిఫరెంట్స్ ఐడియాస్ రావాలేగానీ అనేక అద్భుతాలు సృష్టించవచ్చు.ఇందుకు నిదర్శనమే ఓ పారిశుధ్య కార్మికుడు.

వ్యాక్యూమ్ క్లీనర్ తో ఎవరైనా ఇంటిని శుభ్రం చేస్తారు.కానీ అతడు డిఫరెంట్ గా ఆలోచించి రోడ్డును శుభ్రం చేసే వ్యాక్యూమ్ క్లీనర్ కు కనుక్కొన్నాడు.

అతన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.నిజమేనండి.

కావాలంటే అతని గురించి మీకు కూడా తెలుసుకోవాలంటే ఇది చదవండి.మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు గ్రామ పంచాయతిలో పని చేస్తున్న ఓ స్కావెంజర్.

Advertisement

ఇంట్లో తొలగించినట్టు గానే.రోడ్డుపై ఉన్న దుమ్మును, తేలికపాటి చెత్తను తొలగించాలని వెరైటీగా ఆలోచించి తన బుర్రకు పదును పెట్టాడు.

పురుగుల మందు కొట్టే యంత్రం సహాయంతో వినూత్నంగా రోడ్డును క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు.సామాన్యంగా ఈ పంపును పొలంలో పురుగుల మందు చల్లేందుకు ఉపయోగిస్తారు.

కానీ ఈ పారిశుధ్య కార్మికుడు డిఫరెంట్ గా ఆలోచించి దానిని మరో రకంగా ఉపయోగించడం మొదలుపెట్టాడు.దీనిని చూసిన అందరు మొదట ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అనంతరం అతన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.ఈ క్రమంలోనే సదురు పారిశుధ్య కార్మికుడు ఈ పంపు సహాయంతో రోడ్డును క్లీన్ చేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దీంతో అది అలా అలా వైరలవుతున్నది.సదురు పారిశుధ్య కార్మికుడి డిఫరేంట్ ఐడియాకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.పలు సినిమా డైలాగులతో అతన్ని మామూలుగా పొగడటం లేదు.

Advertisement

నిజమేమరి కొత్త ఐడియాలతో సరికొత్త ఆవిష్కరణలను సృష్టిస్తే ఆ కిక్కే వేరప్పా.ఆ.మరింకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయ్యండి.కొత్త ఐడియాలను మీరు సైతం అభినందించండి.

మనలో కూడా కొత్తగా, డిఫరెంట్ గా ఆలోచించే వారిని ఎంకరేజ్ చేయండి.వారికి అండగా నిలవండి, ధైర్యాన్ని ఇవ్వండి.

తాజా వార్తలు