ఆవును వివాహం చేసుకున్న వృద్ధురాలు... ఎందుకంటే..?

మనుషులు పెళ్లి చేసుకోవడం గురించి మనం వింటూ ఉంటాం.

ఈ మధ్య ఇద్దరూ ఆడవాళ్లు, లేదంటే ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకోవడం గురించి కూడా కొన్ని కథనాల్లో మనం చదివే ఉంటాం.

అయితే ఈ వృద్ధురాలు మాత్రం కాస్త వెరైటీ అనే చెప్పాలి.ఎందుకంటే ఈవిడ మనుషులను పెళ్లి చేసుకోలేదు.

ఒక జంతువును పెళ్లి చేసుకుని ఆ జంతువులో చనిపోయిన ఆమె భర్తను చూసుకుంటుంది.అసలు ఇంతకీ ఆ వృద్ధురాలు ఏ జంతువుని పెళ్లి చేసుకుందో తెలుసా.

మనం నిత్యం ఎంతో పవిత్రంగా కొలిచే ఒక ఆవును పెళ్లి చేసుకుంది.ఏంటి వింటుంటేనే విచిత్రంగా ఉంది కదా.మరి ఆ వృద్ధురాలి కథ ఏంటో ఒకసారి తెలుసుకుంటే పోలా.ఈ వింత ఘటన కంబోడియాలో జరిగింది.

Advertisement

ఒక ప్రముఖ వార్త పత్రిక కథనం ప్రకారం, కంబోడియాలోని క్రతి ప్రావిన్స్‌ లో నివాసం ఉండే ఖిమ్ హాంగ్ అనే 74 వృద్ధురాలు నివాసం ఉంటుంది.ఆమెకు ఇద్దరు కుమారులు.

కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆమె భర్త మరణించాడు.ఆ తర్వాత ఆమె కొన్ని పశువులను పెంచుకుంటూ, వ్యవసాయం చేస్తూ ఇంటిని గడుపుతుంది.

ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఒక ఆవుదూడ పుట్టింది.దానిని ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా చూసుకునేది ఖిమ్ హాంగ్.

దానితోనే ఎక్కువ సమయం గడుపుతూ ఆ ఆవుదూడకు బాగా దగ్గరయింది.అయితే ఆ ఆవుదూడ కూడా ఖిమ్ హాంగ్ కి దగ్గర అయ్యి ఖిమ్ హాంగ్ చేతిని, నుదిటిని తన నాలుకతో నాకేది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అలా చూస్తుండగానే ఆవు పెద్దదయింది.తన భర్తే మళ్ళీ జన్మించాడని ఆవును పెళ్లి చేసుకుంది.అందరికీ అది ఆవులా కనిపించవచ్చు గానీ తనకు మాత్రం తన భర్త కనిపిస్తున్నాడని తెలిపింది.

Advertisement

ఐతే ఆమె ఆవును పెళ్లి చేసుకున్నట్టు ఎటువంటి వీడియోలు గానీ, ఫొటో ఆధారాలు గానీ లేవు.కానీ స్థానికులు మాత్రం వారిద్దరూ తమ సమక్షంలోనే వివాహం చేసుకున్నారని చెబుతున్నారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఆవును వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిలా చూసుకుంటూ ఆవుతో పాటే ఆమె నిద్రపోతుంది.అలాగే ఖిమ్ హాంగ్‌కు ఇద్దరు కుమారులకు కూడా ఆ ఆవును తమ తండ్రిగానే ప్రేమగా చూసుకోవాలని చెప్తూ ఉంటుంది.

వారు కూడా ఆ ఆవునే తమ కన్నతండ్రిలా భావించి ప్రేమగా చూసుకుంటారు.ఒకవేళ ఆవు మరణిస్తే మనిషికి జరిపినట్లుగానే ఆ ఆవుకు కూడా అంత్యక్రియలు జరిపించాలని కొడుకులకు చెబుతోంది.

ప్రస్తుతం ఈ మహిళ స్టోరీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తాజా వార్తలు