వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ఖరారు.. బీసీసీఐ ఎన్ని వందల కోట్ల ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందో తెలుసా..?

The ODI World Cup 2023 Schedule Is Finalised.. Do You Know How Many Hundreds Of Crores Of Tax BCCI Is Paying To The Central Government, ODI World Cup 2023 , BCCI , Tax, Sports News, Sri Lanka , Australia, New Zealand, Pakistanin, Dia

వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup ) కు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న ముగుస్తుంది.ఇందుకోసం ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ తో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ఇండోర్, గౌహతి, లక్నో, రాజ్ కోట్, కోల్ కత్తా, ధర్మశాల, హైదరాబాద్ లలో ఉండే 12 వెన్యూలను ఎంపిక చేయడం జరిగింది.

 The Odi World Cup 2023 Schedule Is Finalised.. Do You Know How Many Hundreds Of-TeluguStop.com

46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్లతో కలిపి 48 మ్యాచులు జరగనున్నాయి.కానీ ఏ మ్యాచ్ లు ఎక్కడ జరుగుతాయో ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు.కానీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.వాతావరణ పరిస్థితుల వల్ల మ్యాచుల పూర్తి షెడ్యూల్ ఖరారు కాలేదు.

Telugu Australia, Bcci, Central, Latest Telugu, Zealand, Odi Cup, Pakistanin, Sr

అయితే బీసీసీఐ( BCCI ), భారత ప్రభుత్వం నుండి ఇంకా కొన్ని అనుమతులు పొందాల్సి ఉంది.అందులో టోర్నమెంట్ కు సంబంధించిన పన్ను మినహాయింపు, పాకిస్తాన్ జట్టుకు భారత్లో ఆడేందుకు వీసా క్లియరెన్స్ లు ప్రధానంగా ఉండే సమస్యలు.ఇటీవలే దుబాయిలో జరిగిన ఐసీసీ సమావేశాలలో బీసీసీఐ పాకిస్తాన్ బృందానికి వీసాల విషయంలో భారత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Telugu Australia, Bcci, Central, Latest Telugu, Zealand, Odi Cup, Pakistanin, Sr

వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ కి ఇండియా తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్లు నేరుగా అర్హత సాధించాయి.నెదర్లాండ్స్, వెస్టిండీస్, శ్రీలంక, సౌత్ఆఫ్రికా, జింబాబ్వే, ఐర్లాండ్ దేశాలు క్వాలిఫయర్స్ రౌండ్ లో పోటీ పడబోతున్నాయి.

బీసీసీఐ, భారత కేంద్ర ప్రభుత్వానికి ( Central government )వివిధ రకాల ట్యాక్స్ ల రూపంలో వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచుల నిర్వహణ కోసం రూ.963 కోట్ల రూపాయలను చెల్లించనుంది.కానీ క్రికెట్ ను ప్రోత్సహించడం కోసం ఐపీఎల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐపీఎల్ కోసం బీసీసీఐ ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్ లు చెల్లించాల్సిన అవసరం లేదు.ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు వేలంలో ఎన్ని కోట్లు ఆటగాళ్ల కోసం పెడతాయో అందులో 20% కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి.

అలాగే ప్లేయర్లు కూడా ఐపీఎల్ లో తమకు వచ్చే డబ్బుల్లో 10% కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube