నరేష్ నిత్య పెళ్లి కొడుకు... సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు రాజేంద్రప్రసాద్!

లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో సంతోష్ శోభన్(Santosh shoban) మాళవిక నాయర్ (Malavika Nayar)హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం అన్ని మంచి శకునములే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

 Actor Rajendraprasad Shocking Comments On Naresh Marriages Details, Nandini Redd-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు.ఇక ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సాంగ్ లాంచ్ చేయడం కోసం ఒక ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పలువురు చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

Telugu Nandini Reddy, Naresh, Nareshrajendra, Pavitra Lokesh, Rajendra Prasad, S

ఈ కార్యక్రమంలో నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) సీనియర్ నటుడు నరేష్ (Naresh) మధ్య జరిగినటువంటి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా రెండు కుటుంబాల మధ్య సాగే అద్భుతమైన కథ అని తెలిపారు.ఈ సమయంలోనే మీడియా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ గారిని ప్రశ్నిస్తూ రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అంటారు కదాఅని ప్రశ్నించగా రాజేంద్రప్రసాద్ సమాధానం చెబుతూ తాను కత్తి కాదని నరేష్ మాత్రమే కత్తి అని నేను కేవలం ఒర మాత్రమే అంటూ తెలిపారు.

ఆడు కత్తే, మామూలోడు కాదు.మీ అందరికి తెలుసు బాగా కత్తి వాడు అంటూ.వాడి రేంజ్ కత్తి మేము వాడం అంటూ ఆట పట్టించారు.

Telugu Nandini Reddy, Naresh, Nareshrajendra, Pavitra Lokesh, Rajendra Prasad, S

అనంతరం నరేష్ ను దగ్గరకు పిలిచి తనకు నరేష్ తమ్ముడు లాంటివాడని తెలిపారు.చూశారా పెళ్లి కొడుకులా ఉన్నారు కదా అని రాజేంద్రప్రసాద్ అనగా వెంటనే నరేష్ నేను పెళ్ళికొడుకు ఏంటి నేను నిత్యం పెళ్లి కొడుకునే అంటూ కామెంట్ చేశారు.ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ అవునురా నేను చెప్పడం మర్చిపోయాను నువ్వు నిత్యం పెళ్లి కొడుకు వేరా అంటూ నరేష్ పై సెటైర్ వేశారు.

ఇలా నరేష్ ను రాజేంద్రప్రసాద్ నిత్య పెళ్లి కొడుకు అంటూ సంబోధించి మాట్లాడటంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.అందుకు అనుగుణంగానే ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా మరొక నటితో కూడా రిలేషన్ లో ఉంటూ తాజాగా తనని పెళ్లి చేసుకున్నట్టు ఒక వీడియోని కూడా విడుదల చేయడంతో రాజేంద్రప్రసాద్ అన్నటువంటి కామెంట్స్ నరేష్ కు సరిగ్గా సరిపోతాయి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube