తమిళనాడులో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం.. మొత్తం మంత్రుల జాబితా ఎంతంటే.. ?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన డీఎంకే అధినేత స్టాలిన్ సారధ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతోంది.

ఈ ప‌నిలో బిజీబిజీగా ఉన్న స్టాలిన్ తనతో కలిపి 34 మంది మంత్రుల జాబితాను రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు పంపారు.

అదీగాక తమిళనాడు సీయం గా డీఎంకే అధినేత స్టాలిన్‌ రేపు పదవీ స్వీకారం చేయనున్నారు.ఇకపోతే జయలలిత మరణించిన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది.

కాగా ఈ రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో 156 స్థానాలను డీఎంకే కూటమి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే పదేళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ డీఎంకేకు అధికారం వరించింది ఇదిలా ఉండగా ఈ రాష్ట్ర మంత్రి వర్గంలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా స్థానం లభిస్తుందని ఆశించారు.

కానీ స్టాలిన్ గవర్నర్ కు పంపిన జాబితాలో ఉదయనిధి పేరు లేదట దీంతో ఆయన కుమారునికి ఏ పదవి ఇస్తారో అనే ఆసక్తి సర్వత్రా ఇక్కడి రాజకీయ నాయకుల్లో చోటు చేసుకుందట.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు