ఇంద్రకీలాద్రి పై అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు...

9వ రోజు విజయదశమి సందర్బంగా నేడు శుక్రవారం అమ్మవారు రాజరాజేశ్వరి దేవి గా భక్తులకు దర్శనమిస్తున్నారు.

విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.

దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు జరుపుకుంటారు.చిరునవ్వుతో చెరుకుగడను వామ హస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదించే రూపంతో షోడ శాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం.

The Most Glorious Dussehra Festival On Vijayawada Indrakeeladri Details, Dasara

శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి నాడు దర్శించడం వలన సర్వ శుభములు కలుగుతాయని భక్త్తుల విశ్వాసం.ఉత్సవాలలో చివరి ఘట్టమైన తెప్పోత్సవం తో దసరా ముగింపు.

కృష్ణా నదిలో గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వరులు త్రిలోక సంచారం చేసేందుకు కృష్ణమ్మ ఒడి లో జలవివహారం.మూడుసార్లు ప్రదక్షణ గా సాగె ఈ ఘట్టాన్ని తిలికించేందుకు భక్తులు పోటెత్తుతారు.

Advertisement

నది లో వరద ప్రవాహం ఉన్నందున విహారం ను రద్దు చేసి తీరం లోనే ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు