సిద్దు జొన్నలగడ్డ సినిమా లైనప్ అదిరిపోయిందిగా...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

ఇక ఇలాంటి సందర్భంలోనే చాలామంది నటులు వారు చేసే సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు.

ఇక ఇప్పుడు కొంతమంది యంగ్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే తెలుగులో ఉన్న సిద్దు జొన్నలగడ్డ ( Siddhu Jonnalagadda )లాంటి స్టార్ హీరోలు సైతం ఇప్పుడు వాళ్ల పరిధిని విస్తరించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

The Line-up Of Siddu Jonnalagaddas Movie Is Packed ,siddhu Jonnalagadda, Tolly

ఇక ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్( Bhaskar ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత మరి కొంత మంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆయన మిస్టర్ బచ్చన్ సినిమాలో క్యామియో రోల్ పోషించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.అలాగే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.

The Line-up Of Siddu Jonnalagaddas Movie Is Packed ,siddhu Jonnalagadda, Tolly

ఇక దీని తర్వాత యంగ్ డైరెక్టర్లతో పాటు సీనియర్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి ఉత్సాహన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.డీజే టిల్లు( Tillu Square ) సినిమాతో ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఈ సినిమా నుంచి వచ్చిన సీక్వెల్ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆ సినిమాకి పార్ట్ 3 ని కూడా తెరకెక్కించే పనిలో ఉన్నారు.

Advertisement
The Line-up Of Siddu Jonnalagadda's Movie Is Packed ,Siddhu Jonnalagadda, Tolly

ఇక తన మడ్యూలేషన్ తో యూత్ లో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న సిద్దు తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.అందుకే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ముందు అడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక నందిని రెడ్డి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్దు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు