ఈ సైబర్ ట్రక్ ఫీచర్స్ మామూలుగా లేవుగా..లాంచ్ కి ముందే 1.9 లక్షల బుకింగ్స్..!

టెస్లా ( Tesla )తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ పికప్ సైబర్ ట్రక్ లాంచ్ ఈ ఏడాది 2023 చివరలో అవ్వనుంది.అయితే ఇప్పటికే ఒకటి.తొమ్మిది లక్షల మంది బుక్ చేసుకున్నట్లు కంపెనీ నివేదించింది.2019 నవంబర్లో ఈ సైబర్ ట్రక్కుల బుకింగ్ ను టెస్లా కంపెనీ ప్రారంభించింది.తాజాగా ఈ సైబర్ ట్రక్ గురించి కంపెనీ సీఈవో ఎలాన్ మాస్క్( CEO Elon Musk ) మాట్లాడుతూ.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ పికప్ లకు డిమాండ్ భారీగా ఉందన్నారు.అందుకే కంపెనీ గరిష్ట సామర్థ్యంతో ప్రతి సంవత్సరం 3.75 లక్షల సైబర్ ట్రక్కులను తయారు చేయనుందని తెలిపారు.టెస్లా టెక్సాస్ గిగా ఫ్యాక్టరీ నుండి మొదటి సైబర్ ట్రక్ తాజాగా విడుదల అయింది.ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ డెలివరీలు 2023 నవంబర్ తర్వాత ప్రారంభం అవుతాయి.

 The Features Of This Cyber Truck Are Not Usual 1.9 Lakh Bookings Before The Laun-TeluguStop.com

ఇక ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది ప్రీ- ప్రొడక్షన్ ప్రోటో టైపును పోలి ఉంది.దీని డిజైన్ ప్యూచరిస్టిక్ గా ఉంటుంది.ఈ సైబర్ ట్రక్ బాడీ అల్ట్రా-హార్డ్ 30X కోల్డ్ రోల్డ్ స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారుచేయబడింది.

ట్రక్ 9mm బుల్లెట్ల దాడిని ఆపగలదు.ఈ ట్రక్ మల్టి పవర్ ట్రెయిన్ ను అందిస్తుంది.

సింగిల్ లేదా మల్టీ మోటర్లను కలిగి ఉంటుంది.సింగిల్ మోటారు వేరియంట్ 6.5 సెకండ్లలో జీరో నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.ఈ వేరియంట్ పరిధి 402 కిలోమీటర్లు.టోయింగ్ కెపాసిటీ ID 3400కిలోలు, పేలోడ్ 1360కిలోలు.ఈ ట్రక్ గరిష్ట రైడ్ ఎత్తు 16 అంగుళాలు, కావాలంటే రైడ్ ఎత్తును 4 అంగుళాలు పెంచవచ్చు లేదంటే తగ్గించవచ్చు.6.5 అడుగుల పొడవైన లోడ్ బే 2800 లీటర్ల స్థలాన్ని అందిస్తుంది.17 అంగుళాల టాబ్లెట్ స్టైల్ టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube