వాస్తవాలు దాచి సంతకం పెట్టించారు.. ట్విట్టర్ పై ఎలాన్ మస్క్ దావా..

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని మళ్లీ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ట్విట్టర్ ఎలాన్ మస్క్ పై డెలావర్ కోర్టులో దావా వేసింది.

అయితే దీనిపై ఇటీవల ఆయన కౌంటర్ దావా వేశారు.ఈక్రమంలో ఆయన ట్విట్టర్ పై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

తమ వేదికపై నకిలీ ఖాతాల వివరాలను ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమవడంతోనే ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.ఎలాన్ మస్క్ తాజాగా వేసిన దావాలో ట్విట్టర్ పై మరిన్ని ఆరోపణలు చేశారు.

భారత ప్రభుత్వంతో ట్విట్టర్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన వివాదాన్ని ఆయన ప్రస్తావించారు.భారత ప్రభుత్వంపై ట్విట్టర్ వేసిన ప్రమాదకర వ్యాజ్యాన్ని ఆ సంస్థ ఒప్పందంలో బటయపెట్టలేదని ఆరోపించారు.

Advertisement

వాస్తవాలను దాచి తనను మభ్యపెట్టి ట్విట్టర్ కొనుగోలుకు తనతో సంతకం చేయించారంటూ వ్యాఖ్యానించారు.భారత్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను పాటించకుండా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ కోర్టకు వెళ్లిందన్నారు.

దీంతో తన మూడో అతిపెద్ద మార్కెట్ ని ప్రమాదంలో పడేసిందని, ఈ వ్యాజ్యం గురించి ట్విట్టర్ ఒప్పందంలో వెల్లడించలేదని ఎలాన్ మస్క్ తన దావాలో పేర్కొన్నారు.అయితే ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై ట్విట్టర్ మండిపడుతుంది.

ఒప్పందం నుంచి తప్పించుకోవడానికి మస్క్ సాకులు చెబుతున్నారని ఆరోపించింది.

కాగా, భారత ప్రభుత్వం ఐటీ చట్టంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది.అయితే ఈ మార్పులకు అనుగుణంగా నడుచుకోవడానికి ట్విట్టర్ అంగీకరించలేదు.అంతేకాదు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నయంటూ ఆరోపించింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

గతేడాది జూలైలో ఈ వ్యవహారంపై ట్విట్టర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై స్పందించాలని కోర్టు భారత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు