బైక్ నడిపేస్తున్న కుక్క‌.. వీడియో చూస్తే షాక్‌..

ప్రపంచంలో ఉన్న అన్ని మూగ జీవాల్లోకెల్లా అత్యంత విశ్వాసంగా ఉండే జంతువు ఏది అని అడిగితే ప్రతి ఒక్కరూ ఠక్కున చెప్పే సమాధానం కుక్క( శునకం )అంతలా కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

తమను పెంచుతున్న యజమానులు ఏం పని చెబితే ఆ పనులు చేయడం కుక్కలకు అలవాటు .

అలా చేస్తూనే ఒక్కో సారి చిలిపి వేషాలు కూడా వేస్తుంటాయి.కుక్కల చిలిపి వేషాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

ఆ వీడియోలు చూస్తే మనం తెగ నవ్వుకోవడం మాత్రం పక్కా.అవి ఎటువంటి చిలిపి పనులు చేసినా కానీ వాటి యజమానులకు వాటి మీద ఉన్న నమ్మకం మాత్రం పోదు.

అంతలా వారు వాటిని మచ్చిక చేసుకుంటూ ఉంటారు.ప్రస్తుతం కుక్క బైక్ నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Advertisement

ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందంటే.

ఓ ఇద్దరు వ్యక్తులు హైవే రోడ్డు మీద బైక్ నడుపుకుంటూ వెళ్తుంటారు.మనం వెనుక నుంచి చూస్తే ఆ వ్యక్తుల్లో ఒకరు బైక్ నడుపుతున్నారని అనుకుంటాం.

కానీ ఇక్కడే మనం పొరబడతాం.అసలు బైక్ ను నడిపేది ఆ వ్యక్తులు కాదు.

బైక్ మీద కూర్చున్న కుక్క.ఏ మాత్రం బెరుకు అనేది లేకుండా కంగారు పడకుండా, బ్యాలెన్స్ తప్పకుండా కుక్క బైక్ ను నడుపుకుంటూ వెళ్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్క నెటిజన్ షాక్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.మ‌రి ఇంకా లేటెందుకు కుక్కే డ్రైవర్ లా మారి బైక్ నడుపుతున్న ఈ వైరల్ వీడియోను వెంటనే మీరూ చూసేయండి.మీకు అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి.

Advertisement

తాజా వార్తలు