కల్వకుంట్ల ఫ్యామిలీ బ్లడ్ లో అబద్ధం అనే డిఎన్ఏ ప్రవహిస్తుంది.. పాలకూరి రవి

నల్లగొండ జిల్లా:కల్వకుంట్ల కుటుంబంలోని ప్రతీ ఒక్కరి రక్తంలో అబద్ధపు డీఎన్ఏ ప్రవహిస్తుందని బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ అన్నారు.

శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.దేశ నిర్మాణానికి నిస్వార్ధంగా సేవలందిస్తున్న మోడీకి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేయడం అయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

అబద్దం మీ కుటుంబ యొక్క బ్లడ్ లో ప్రవహిస్తుందని మీ మాటల ద్వారా అర్థమవుతుందన్నారు.డిఎన్ఏ పరీక్షలు,లై డిటెక్టర్లు మీ కుటుంబానికి జరపాలని ఎద్దేవా చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

Latest Suryapet News