వింత వ్యాధితో బాధపడుతూ ఎమోషనల్ నోట్ రాసిన అమీర్ ఖాన్ కూతురు?

స్టార్ హీరో అమీర్ ఖాన్ గారాలపట్టి ఐరా ఖాన్ ఒక వింత వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా ఈ విషయాన్ని ఐరా ఖాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఒక మాయదారి రోగం తనని వెంటాడుతోందని ఈ సందర్భంగా తాను బాధపడుతున్న వింత వ్యాధి గురించి ఈమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇంతకీ ఆమెను వెంటాడుతున్న ఆ వింత వ్యాధి ఏమిటి అనే విషయానికి వస్తే.ప్రస్తుతం తనపై యాంగ్జైటీ అని ఒక వింత వ్యాధి దాడి చేస్తోందని,గతంలో తనకు ఈ వ్యాధి లేకపోయినప్పటికీ ప్రస్తుతం తనని పట్టిపీడిస్తోందని వెల్లడించారు.

ఈ వ్యాధి వల్ల ఎంతో ఉద్వేగానికి గురవ్వడమే కాకుండా క్రైయింగ్ ఫిట్స్ పట్టి చంపేస్తోంది అంటూ బాధను వెల్లబుచ్చింది.ఈ సమస్య తనకు ఎలా వచ్చిందో ఇప్పటికీ తనకు అర్థం కాలేదని గతంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలాంటి వ్యాధితో బాధపడే తను ప్రతి రోజు ఈ వ్యాధిని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

ఈ వ్యాధితో బాధపడుతూ సరిగా నిద్ర కూడా పట్టడం లేదని, నన్ను ఈ వ్యాధి వదలడం లేదు నా భయం ఏంటో తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది.నాకే ఇలా ఎందుకు జరుగుతోందో అంటూ ఐరా ఖాన్ తనను వెంటాడుతున్నవింత వ్యాధి గురించి ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు