ఆమ్ ఆద్మీ పార్టీ నేత సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నట్లుగా తెలుస్తుంది ఎటువంటి ఆధారాలు లేకుండా రాజకీయ కారణాలతో అరెస్టులు చేయడానికి ఖండిస్తూ విపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి కి లేఖ రాశారు .

భాజపా నిరంకుశ పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థలను వాటి అధికారాలను దుర్వినియోగం చేస్తూ వాటిని తమ రాజకీయ ప్రాబల్యం కోసం ఉపయోగించుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఈ లేఖలో వివరించారు.ఇటువంటి నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తే ప్రపంచం ముందు భారతప్రజాస్వామ్య స్ఫూర్తి పలుచనవుతుందని పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను బిజెపి అర్థం చేసుకోవాలని, భారతీయ జనతా పార్టీ నినాదం హిందుత్వ విధానాలు అయితే అయి ఉండవచ్చని కానీ భారతదేశoo లౌకిక దేశం, లౌకిక స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యతను మన ప్రధానమంత్రి అర్థం చేసుకోవాలని తమ మంత్రివర్గ సహచరుల అతివాద వ్యాఖ్యలను కంట్రోల్ చేయాలని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం యొక్క విలువలను కాపాడాలని ఈ లేఖలో ఉటంకించారు

2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర దర్యాప సంస్థల విచారణ ఎదుర్కొంటున్న అత్యధిక నాయకులు బిజెపయేతర పార్టీ వాళ్లేనని బిజెపిలో చేరిన నాయకులు మాత్రం పునీతులు అవుతారని వారిపై విచారణ వేగం మందకిస్తుందని ఉదాహరణగా అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ పై నమోదైన కేసులు లేఖలో వివరించారు .ఇకనుండి అయినా స్వతంత్రంగా పనిచేయాల్సిన దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం మానాలని ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవాలని కోరారు.లేఖ రాసిన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జెడి నేత తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరత్ పవార్, శివసేన యు బి టి నేత ఉద్దవ్ తాకరే , ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మొదలైన వారు ఉన్నారు.







