దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు భారీగా నమోదవుతున్నాయి.ఏకంగా స్కూల్ మరియు కాలేజీలు చదువుతున్న విద్యార్థులు సైతం గుండెపోటుకు గురై మరణించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఒకప్పుడు పెద్ద వయసు కలిగిన వారు గుండెపోటుకు గురై ఎక్కువుగా మరణించేవారు.కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి.
స్కూల్లో విద్యార్థులు నడుస్తూ నడుస్తూనే చనిపోతున్నారు.
సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు.గత రెండు సంవత్సరాల నుండి గుండెపోటు మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే గుండెపోటుతో ఐదుగురు మరణించారు.ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి కి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి రాకేష్(18),

సిద్దిపేట జిల్లా కడవేర్గు గ్రామానికి చెందిన శ్రీనివాస్ (36), నిర్మల్ జిల్లా కుంటాలలోని ఓ పాఠశాల హెచ్ఎం లాలన్న(50), కామారెడ్డి జిల్లా జనకంపల్లి ఖుర్ధు గ్రామంలో ఓ ఆయా(54), ఎల్లారెడ్డిలో అహ్మద్ (36) అనే వ్యక్తులు గుండెపోటుతో మరణించడం జరిగింది.







