సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.ముఖ్యంగా వివాహ వ్యవస్థ( Marriage System ) చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్లిపోయింది.
అక్రమ సంబంధాలు( Illegal Affairs ) పెరిగిపోతున్నాయి.ఐదు నిమిషాల సుఖాల కోసం భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి కారణంగా హత్యలు జరుగుతున్నాయి.
దీంతో పిల్లలు అనాధలు అయిపోతున్నారు.చిన్న చిన్న కారణాలకి విడాకులు( Divorce ) తీసేసుకుంటున్నారు.
జీవితాంతం కలసి జీవించాల్సిన వ్యక్తితో మరో వ్యక్తి ఈ వివాహ వ్యవస్థలో అత్యంత దారుణంగా మోసం చేసే పరిస్థితి ప్రస్తుత సమాజంలో కనిపిస్తుంది.ఇంకా పెళ్లికి ముందే విచ్చలవిడిగా తిరుగుతూ తమ యవ్వన జీవితాన్ని చాలామంది యువతీయువకులు పాడు చేసుకుంటూ ఉన్నారు.
ఈ రకంగా పెళ్లికి ముందే భాగస్వామితో పొందాల్సిన సంతోషాన్ని ముందే పొంది.కొంతమంది మోసపోతున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.మేటర్ లోకి వెళ్తే పెళ్లైన రెండు రోజులకే పెళ్లికూతురు బిడ్డకు జన్మనివ్వడం జరిగింది.ఉత్తరప్రదేశ్ నోయిడా( Noida ) స్థానిక యువకుడికి సికింద్రాబాద్ కి చెందిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది.ఈనెల 26వ తేదీన వీరి వివాహం జరిగింది.
అయితే వివాహమైన మరునాడు వధువు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.పరీక్షించిన వైద్యులు ఏడు నెలల గర్భిణీ అని చెప్పడంతో వరుడు షాక్ అయ్యాడు.
కాగా మరుసటి రోజే ఆ నూతన వధువు ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది.