పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ ( Bro The Avatar )చిత్రం వచ్చే నెల 28 వ తారీఖున విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్స్ ఇప్పటికే విడుదల అయ్యాయి కానీ, టీజర్ విడుదల కాకపొయ్యేసరికి ఫ్యాన్స్ చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్త పరిచారు.
టీజర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు.ప్రతీ రోజు నిర్మాతలను ట్విట్టర్ లో ట్యాగ్ చేసి బండ బూతులు తిట్టడం ప్రారంభించారు.
అలా అన్ని రోజుల వారి ఎదురు చూపులకు మొత్తానికి తెరదించుతూ, నేడే ఈ సినీమా టీజర్( Bro Movie Teaser ) ని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.టైమింగ్ కూడా సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు అని అన్నారు.
కానీ చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల టీజర్ ని కాసేపు వాయిదా వేస్తున్నాము అని చెప్పడం తో ఫ్యాన్స్ ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది.

అలా బాగా ఆలస్యం చేసి మొత్తానికి 6 గంటల 45 నిమిషాలకు టీజర్ ని విడుదల చేసారు.ఈ టీజర్ కి సోషల్ మీడియా లో ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.వింటేజ్ పవన్ కళ్యాణ్( Vintage Pawan Kalyan ) ని ఒక్కసారి చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు.
అసలు ఈ సినిమా నుండి ఇలాంటి మాస్ ని ఫ్యాన్స్ ముందు నుండి అసలు ఊహించలేదు.నటుడిగా మన అందరికీ బాగా పరిచయమైనా సముద్ర ఖని( Samuthirakani ) లో ఇంత దర్శకత్వ ప్రతిభ దాగి ఉందా అని అందరూ ఆశ్చర్య పోయిన వేళ ఈరోజు.

ఇదే రేంజ్ లో సినిమా ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఎన్ని బాల్స్ అవుతాయో చెప్పలేం.ఇక ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ బాగా వాడుకున్నట్టు అర్థం అవుతుంది.ఇది అందరూ గమనించిన విషయమే, కానీ ఎవ్వరూ గమనించని కొన్ని చిన్న చిన్న విషయాలను ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము, అవేంటో మీరే చూడండి.

ఈ టీజర్ ప్రారంభం లో పవన్ కళ్యాణ్ తమ్ముడు గెటప్ లో కనిపించడం మన అందరం చూసిందే.కానీ మధ్య మధ్య లో పార్టీ షాట్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ జల్సా మూవీ ఫోజుని ఇవ్వడం గమనించొచ్చు.

అలాగే బ్లాక్ హూడి వేసుకొని స్టైల్ గా గ్లాస్ పెట్టుకొని నడిచి వచ్చే షాట్ ని మీరంతా గమనించే ఉంటారు.అక్కడ పవన్ కళ్యాణ్ నడిచేటప్పుడు ఆయన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటి ‘రా రా బంగారం’ అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుందట.అలా సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ భాగం జల్సా రేంజ్ ఎంటర్టైన్మెంట్( Jalsa Movie ) తో నిండిపోయి ఉంటుందట.
మరి ఈ రేంజ్ ఉంటే అభిమానులు ఇక ఎందుకు ఆగుతారు, ఓపెనింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఇస్తారు.చూడాలి మరి పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.







