రాష్ట్రంలో విమానాశ్రయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అవుతుంది.కరోనా పరీక్షలు పెంచుతూ ఉండటంతో కేసులు అధికంగా బయటపడుతూ ఉండటంతో.

 The Ap Government Has Taken A Key Decision Regarding Airports In The State  Gann-TeluguStop.com

కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది.ఈ క్రమంలో ఇప్పటికే రేపటినుండి రాష్ట్రంలో 18 గంటల పాటు పాక్షిక కర్ఫ్యూ రెండు వారాల పాటు అమలు చేయాలని డిసైడ్ అవ్వడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో విమానాశ్రయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

మేటర్ లోకి వెళ్తే ఈ రోజు నుండి గన్నవరం విమానాశ్రయంలో కేవలం ప్రయాణికులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రయాణికుడి తో పాటు డ్రైవర్ మాత్రమే విమానాశ్రయ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులు మరియు స్నేహితులు ఎవరైనా సరే ప్రధాన ద్వారం వద్దే నిలిచిపోవాలని స్పష్టం చేసింది.

అంతేకాకుండా విమానాశ్రయ ప్రాంగణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు పాజిటివ్ వస్తే వెంటనే క్వారంటైన్ కి తరలించనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube