విడాకులకు ఫోటోషూట్ చేయించిన నటి... ఇదేం ట్రెండ్ రా బాబు?

సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోను పెళ్లి అనేది ఎంతో ముఖ్యం అందుకే జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లి చాలా ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు.

అయితే ప్రస్తుత కాలంలో పెళ్లికి ముందే పెద్ద ఎత్తున ఫోటోషూట్లు చేయించుకోవడం పెళ్లి తర్వాత కూడా ఫోటో షూట్ లు చేయించుకోవడం సర్వసాధారణం.

పెళ్లి అని మాత్రమే కాకుండా మన జీవితంలో జరిగే అతి ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలకు ఇలా ఫోటోషూట్లు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది మెటర్నటీ ఫోటోషూట్ కూడా చేయించుకుంటున్నారు.అయితే తాజాగా ఓ బుల్లితెర నటి మాత్రం చాలా విభిన్నంగా విడాకుల ఫోటో షూట్ ( Divorce Photo Shoot ) చేయించుకున్నారు.ఈమె తన భర్తతో విడాకులు తీసుకోబోతున్న నేపథ్యంలో విడాకులకు కూడా ఫోటోషూట్ చేయించుకునే వార్తల్లో నిలిచారు.

ఎలా విడాకులకు ఫోటోషూట్ చేయించుకున్న ఆనటి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.

Advertisement

తమిళ ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర నటి షాలిని ముల్లుమ్ మల్లారూమ్ ( Shalini Mullum Mallaarum )అనే నటి తమిళ సీరియల్స్ లో నటిస్తూ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈమె రియాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు రియా( Riya ) అనే కుమార్తె కూడా ఉంది.

అయితే గత కొద్దిరోజులుగా తన భర్త రియాజ్ తనని శారీరకంగా మానసికంగా ఎన్నో హింసలకు గురి చేస్తున్నారు అంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.కోర్టులో విడాకులు మంజూరు కావటంతో సంతోషంలో ఈమె ఘనంగా విడాకుల ఫోటోషూట్ జరిపించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో విడాకులు తీసుకుంటే కూడా ఇలా ఫోటోషూ జరిపిస్తారా ఇదేం ట్రెండ్ అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు