ఉత్తమ్ కు ఆ శాఖ.. భట్టి కి ఈ శాఖ ! పదవులు ఆశిస్తున్న నేతలు వీరే ?

ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి.

రేవంత్ రెడ్డి తో పాటు మరో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఈ జాబితాలో పార్టీ సీనియర్ నాయకులు ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా దామోదర రాజానసింహ,  దుద్దిళ్ శ్రీధర్ బాబు , సీతక్క , పొన్నం ప్రభాకర్ తదితర పేర్లు ఉన్నట్లుగా పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.  ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కూడా మంత్రి పదవులు ఖాయమన్న ప్రచారం జరుగుతుంది.

రేవంత్ క్యాబినెట్ లో మంత్రి పదవులు దక్కించుకునేందుకు సీనియర్ నేతలు చాలామంది పోటీ పడుతున్నారు.దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట.

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ లో చాలామంది సీనియర్ నాయకులు ఉండడం,  వారంతా అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు కావడంతో,  ఎవరికి వారు తమకు మంత్రి పదవి ఖాయం అన్న ధీమాలో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఎవరెవరుని మంత్రివర్గంలోకి తీసుకోవాలి ?  ఏ ఏ శాఖలు కేటాయించాలనే విషయంలో అధిష్టానంతో చర్చించి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీకి వచ్చారట .ఈ జాబితాలో సీనియర్ నేతలు భట్టి విక్రమార్క,  ఉత్తమ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ,  శ్రీధర్ బాబు , సీతక్క , పొన్నం ప్రభాకర్,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి రేసులో చివరివరకు ఉన్న భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ,  ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్థిక శాఖ, మరో సీనియర్ నేతకు హోంశాఖ ఇవ్వనన్నట్లు పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి .అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.  వాస్తవంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది .అయితే రేవంత్ తో పాటు మొత్తం 12 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ  తంతు ముగిసిన తర్వాత ఈ నెల 9న పూర్తిస్థాయిలో మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది .తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది .కాంగ్రెస్ తరపున గెలిచిన వారిలో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.ఈ జాబితాలో సీనియర్ నేతలు ఎక్కువగా ఉన్నారు .30 మంది వరకు పేర్లను పరిశీలించి ఏఐసిసి ఫైనల్ లిస్టును సిద్ధం చేసినట్లు సమాచారం.రేవంత్ సూచనతో కొంతమంది నేతలకు అవకాశం కల్పించారట.

ఇక ఓ సీనియర్ నేతకు హోం శాఖ కేటాయించాలని నిర్ణయించుకున్నారట.మంత్రి పదవుల రేసులో ఉన్నవారు వీరే

భట్టి విక్రమార్క,  ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి , దామోదర రాజనర్సింహ,  శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  సీతక్క, కొండా సురేఖ ,పొన్నం ప్రభాకర్ , ప్రేమ్ సాగర్ రావు,  సుదర్శన్ రెడ్డి , జి వివేక్ ,జి వినోద్,  తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ),దొంతి మాధవరెడ్డి ,బాలు నాయక్ , టి.రామ్మోహన్ రెడ్డి ,మల్ రెడ్డి రంగారెడ్డి,  జూపల్లి కృష్ణారావు తో పాటు మొదటిసారిగా గెలిచిన ఆది శ్రీనివాస్ , ఈర్ల శంకర్,  వాకిటి శ్రీహరి, పీర్ల ఐలయ్య పేర్లతో పాటు,  అద్దంకి దయాకర్ ,షబ్బీర్ అలీ ,బలరాం నాయక్ వంటి వారి పేర్లు సామాజిక వర్గాల కోటాలో వినిపిస్తున్నాయి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు