వారిసు స్టేజ్ మీద విజయ్ పర్ఫార్మెన్స్.. అదిరిపోయే వీడియో వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.ప్రెజెంట్ విజయ్ కోలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు.

ఈయన గత సినిమా బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకున్న వసూళ్లు మాత్రం బాగా వచ్చాయి.ఇక ఈసారి అయిన సూపర్ హిట్ అందుకోవాలని విజయ్ కష్ట పడుతున్నాడు.

ఈ క్రమంలోనే విజయ్ నెక్స్ట్ సినిమాను పూర్తి చేసాడు.తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తి కాగా ఇక ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి గ్రాండ్ ఈవెంట్ జరిగింది.

ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి తమిళనాట ఘనంగా జరిగింది.

అయితే దీనిని లైవ్ టెలికాస్ట్ చేయలేదు.కానీ ఈ ఈవెంట్ లో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ జరిగినట్టు తెలుస్తుంది.ఈ ఈవెంట్ లో జరిగిన ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ ను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.

రంజితమే సాంగ్ ను విజయ్ స్వయంగా పాడిన విషయం తెలిసిందే.ఈ సాంగ్ ను ఈ స్టేజ్ మీద ఫ్యాన్స్ కోసం లైవ్ లో పాడడంతో ఈ వీడియో మంచి క్రేజీగా మారిపోయింది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఈ సినిమాలోని ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయడం విశేషం.ఇదిలా ఉండగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

Advertisement

తెలుగులో చిరంజీవి, బాలయ్య వంటి స్టార్ హీరోలతో పోటీ పడబోతున్న ఈ సినిమా సంక్రాంతికి ఏ మేర హిట్ అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు