ఫేస్బుక్ లో ఫోటో లైక్ చేసాడు..! 32 ఏళ్ళు జైలు శిక్ష విధించారు.! అసలేమైందో తెలుసా.?

వార్నీ.వార్నీ… ఏంటీ చిత్రం.

విచిత్రం.

అనుకుంటున్నారా? ఏం చేస్తాం….వేదం సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టు.

అదృష్టం బాగాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను ఇరుగుద్ది.అనే విధంగా తయారయ్యింది ఓ ధాయ్ లాండ్ కుర్రాడి పరిస్థితి.

ఫేస్ బుక్ లో తన టైమ్ లైన్ మీదకు వచ్చిన ఓ ఫోటో ను లైక్ కొట్టి, షేర్ చేసినందుకు ఇప్పుడు మనోడి జీవితమే షేక్ అవుతుంది.వీలైతే జరిమానా… కుదిరితే 32 ఏళ్ల జైలు శిక్ష అన్నట్టు కోర్టు తీర్పు మీద ఆధారపడింది ఆ యువకుడి భవిష్యత్.

Advertisement

ఇంతకీ మనోడు అసలు కథేంటంటే.?

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ సమీపంలోని సుముత్ ప్రాకన్ ప్రాంతానికి చెందిన తన్కర్న్ సిరిపై బూన్ అనే యువకుడు డిసెంబర్ 2న ఫేస్‌బుక్‌లో తన టైమ్ లైన్ మీదకు వచ్చిన ఓ ఫోటోకి లైక్ కొట్టాడు.ఆ ఫోటోను షేర్ కుడా చేసాడు.అయితే.

తన్కర్న్ షేర్ చేసిన ఫోటో థాయ్ లాండ్ రాజు భూమిబల్ అదుల్యదెజ్ మార్ఫింగ్ ఫోటో.అదికూడా రాజును తీవ్రంగా అవమానించేవిధంగా ఉంది.

రాజును అవమానించే విధంగా ఉన్న ఫోటోను లైక్ చేసి, షేర్ చేసినందుకుగాను అతనిపై థాయ్ లాండ్ పోలీసులు రాజద్రోహం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసారట.కంప్యూటర్ క్రైం కింద కేసు కూడా నమోదు చేసారట… పోలీసులు .! అలానే ఈ కేసులో అతనికి 32 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి న్యాయశాస్త్ర పండితులు చెబుతున్నారు.గాలికి పోయే కంప వీపుకు కొట్టుకున్నట్టు లేదు మనోడి పరిస్థితి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు