నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ?

ఈ మధ్యకాలంలో అవుతున్న రోడ్దు ప్రమాదాలకు లెక్కేలేదు.మితిమీరిన వేగం వల్ల, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

రహదారులు రక్తంతో తడసి పోతున్నాయి.ఇక తాజాగా నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Terrible Accident In Nellore District Nellore, Milk Van, Terrible Accident, Die

ఈ రోజు ఉదయం సుమారుగ 7 గంటల ప్రాంతంలో చేపల వేట కోసం విడవలూరు వెళ్లేందుకు మినీ ట్రక్కు ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా వచ్చిన పాల వ్యాన్‌ అదుపు తప్పి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం.

ఇక ఈ ప్రమాద ఘటనలో పాల వ్యాన్‌ డ్రైవర్‌ సైతం క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి గాయాలపాలు అయ్యాడట.కాగా ఉపాధి కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో బాధితుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

Advertisement

ఇదిలా ఉండగా ప్రమాదం తాలుకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.బాధితులను హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఆ ఆరోగ్య సమస్యతో హీరో సందీప్ కిషన్ బాధ పడుతున్నారా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు